కవితావిన్యాసాలు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవితాసామ్రాజ్యము
స్థాపించాలని ఉన్నది
కవితాసింహాసనము
అధిరోహించాలని ఉన్నది

కవితాసందడులు
చేయాలని ఉన్నది
కవితాగానమును
వినిపించాలని ఉన్నది

కవితానవ్వులు
కనబరచాలని ఉన్నది
కవితాపువ్వులు
పూయించాలని ఉన్నది 

కవితాకమ్మదనాలు
కుమ్మరించాలని ఉన్నది
కవితాతియ్యదనాలు
క్రోలించాలని ఉన్నది 

కవితాకూర్పులు
చేద్దామని ఉన్నది
కవితావెలుగులు
చిమ్మాలని ఉన్నది

కవితాసేద్యము
సాగించాలని ఉన్నది
కవితాపంటలు
పండించాలని ఉన్నది

కవితాసిరులను
పొందాలని ఉన్నది
కవితాకుబేరుడను
కావాలని ఉన్నది 

కవితాలంకారాలు
మిలమిలమెరిపించాలని ఉన్నది
కవితాకళలు
తళతళలాడించాలని ఉన్నది

కవితాకిరణాలు
ప్రసరించాలని ఉన్నది
కవితావెన్నెలను
వెదజల్లాలని ఉన్నది

కవితావిందులు
వడ్డించాలని ఉన్నది
కవితాపసందులు
చవిచూపాలని ఉన్నది

కవితావనమును
పెంచాలని ఉన్నది
కవితాసౌరభాలను
చల్లాలని ఉన్నది

కవితాకన్యను
చేరదీయాలని ఉన్నది
కవితాసౌఖ్యాలను
అనుభవించాలని ఉన్నది

కవితాకులుకులు
ప్రదర్శించాలని ఉన్నది
కవితాసొగసులు
కళ్ళకందించాలని ఉన్నది

కవితాగుట్టులు
విప్పాలని ఉన్నది
కవితారూపాలు
తెలపాలనిఉన్నది

కవితాసింగారాలు
చూపాలని ఉన్నది
కవితానందము
చేకూర్చాలని ఉన్నది

కవితాకలలు
కనేటట్లుచేయాలని ఉన్నది
కవితాకవ్వింపులకు
గురిచేయాలని ఉన్నది 

కవితావ్యాసాంగము
కొనసాగించాలని ఉన్నది
కవితాపాఠములు
చదివించాలని ఉన్నది

కవితామృతము
కురిపించాలనిఉన్నది
కవితారాధనము
చేయించాలనిఉన్నది

కవితాసారము
త్రాగించాలని ఉన్నది
కవితాప్రియులమదులు
దోచుకోవాలని ఉన్నది

కవితారాజును
కావాలని ఉన్నది
కవితాపాఠకులను
కుతూహలపరచాలని ఉన్నది


కామెంట్‌లు