ఊరుగాలి ఈల 110:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
పైరగాలి వీచింది చలిగాలివ చేఊరు కొమ్మలూగే
మారుమాటలేని గోరాకు అరిచేతి ముగ్గై పల్లేనవ్వే
బీదసాద ఒకటే ఊరు ఇళ్ళేవేరు తీగవీణ పాడేనే

కలిసిన సుఖమే కలదుప్రేమే ఇలలో పల్లేమధురం
జొన్నచేలు వరికంకి కందిచేను ఊరు బువ్వతినేనే
మట్టిబుట్ట సున్నంతల ముదిమికాదు లేతపసిమి 

అందం నీదే పల్లెసీమ తొంగిన దొంగ సిరి పిసినారి
అధరాల మధువు వదననవ్వు ఊరే దాచేచెలిగిలి
మనసాగక పాడేనే కోయిల ఇల వినవే ఓపల్లెచెవీ!

పొలంగట్టు చెట్టు పికముపాట పల్లె వెన్నెల కురిసే
అలలే సాగే తీరంచేర నదికలిసే పల్లెజలధి అందం
నా మనసే విహరమై ఆడే ఊరంతా బోనాల తీర్థం

నాకు తెలిసీ కలంరాసే ఊరోన్ని వెతికేలేసై కెమెరా
మరదలుపిల్ల ఉలికేమల్ల పల్లెచూసే గుబులుగా
సిగ్గులన్నీ మూటగట్టీ పడవెక్కే చెలిసఖా ఊరేదీ

భావకవితలే భామలైసాగే నాగిని నాట్యాల పల్లేలే
దైవం నీవేకదా మాపల్లెల గుడిసేగుడిగా ఏలేకథవే
బాధలబతుకూ ఏరుదాటెగా ఊరు సుఖమేలేనిది

ఇంతలేసి కన్నుల వెదికే నన్నే ఊరు ప్రేమలేకనా
మనసంత నాది ఊరైనది మనిషేలేని కలనై నేను
జన్మలేడు ఉన్నచో ఊరు నా పుట్టుకే ఈలవేసేనదీ

=====================================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు