ఊరుగాలి ఈల 81:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఆశచెట్టు పట్టుగొమ్మ ఊరు మనిషి ఊపిరి నింపే
దేశమంటే ఊర్ల కూడిక మట్టి చేతుల తల్లిభారతి
ఊరు గుండెల స్థిరంచిరం మట్టి వాన దేశదేహమే

రాజకీయ సందుల బలాబలం ఆట పల్లె  బీటల్లేక
రాజనీతి ఊరునీతి కలిస్తే ఓటు దారితప్పితే చేటే
తరాలసారం పల్లె తలరాతల ప్రలోభపెట్టే సిరి చేదే

నేలనుతాకే నింగిఎద గోద్ మే లేతీ మాఁ గాఁవ్ హో
పని కదా పల్లె ఆట అదేలేక గొంతులసీ వెలక్కాయ
అమ్మమాట నా పదంపాట తుమ్మబాటే పల్లెసీమ

కలుపుదీసిన చేను నీటిజీవం గట్టిగింజ పంట పల్లె
ఎవరేమిచెప్పినా వినదు నన్ను పిలిచే నింగి ఊరు
అబద్ధం నిషిద్దం మట్టిలో స్ధిర చరమే మనిషిఊరు

అణాకానిపావలా లొల్లేలేదు గాజు గలగల ఊరట
నిటారు జొన్నకర్రే మనిషి వంగని వరికంకి పల్లె గో
ఎంత దూరమో అంత చేరువ పంటపల్లే నేనుపద

సోదిలేదు సుత్తిలేదు అంతా ఖుల్లా  పద్ధతే ఊరు
చిత్తు కాగితం గాలి సోపతి పెన్నేకైత  మనిషిజత
వాకిలి అతిథి ఏగిలారంగ పోకున్న పద పనికి పల్లె

ఆడమగ పనిల తేడా తల్లిబిడ్డా కలిసే పాలకై పల్లె
అమ్మ ఆదరణ విదురనీతి కొమ్మలసేద  ఊరునిద్ర
చేతిపని చేదబావి వంటలే నోరూరే నాదే పల్లెమేత

==============================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు