నీధైర్యం ,తెగింపు ,నిర్బయం ,
ఏపనికైనా 'సై' అంటాయి!
నీఅందానికి ఫిదాఅయినవాళ్లు
సూర్యునిచుట్టూ భూగోళం అయిపొతారు !!
------------------------------------------------------------(36)
ఒక్కో సందర్భం నీకు
ఒక్కోఅనుభవాన్ని అందిస్తుంది !
స్నేహితులఖాతాలో మరోనంబరుచేరి
మొబైల్ ప్రేమగీతాలుఆలపిస్తుంది !!
------------------------------------------------------------(37)
నువ్వేమో పరుగులు తీస్తున్న
పరువమై తారలాప్రకాశిస్తావు !
ఆ...జిలుగువెలుగుల్లో జనం నిన్ను,
పాతికేళ్ల పడుచుగా భ్రమపడిపోతారు !!
------------------------------------------------------------(38)
అందంగావుండడం తప్పుకాదు !
కానీ..అందాన్ని అడ్డంపెట్టుకుని ...
నిన్ను అభిమానించినవాళ్లతో
నిర్లజ్జగా ఆడుకోవటం తప్పు ....!!
------------------------------------------------------------(39)
నీ పరిచయం...పలకరింపు
తేటతేటమాటల మాధుర్యం
మనిషిని ఇట్టేకట్టిపడేస్తాయి !
నీముందు మోకరిల్లజేస్తాయి !!
-----------------------------------------------------------(40)
అభిమానుల్ని పెంచుకోవడం
సంఖ్యాపరంగా నీకుసరదా ....!
లైక్లు ...కామెంట్ల వరదలో
కొట్టుకుపోతుంది నీ విలువలపరదా !!
------------------------------------------------------(41)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి