గుడి గంటలు కొట్టే పిల్లలం
బడిబాటలు పట్టే మల్లెలం
వడి వడిగా నడిచే వారలం
జడివానకు బెదరని పోరలం !
మా బడిలో గురువును చూస్తాం
మేం గుడిలో దైవ ప్రదక్షణ చేస్తాం
ఆ గురువుకు గురుదక్షిణ ఇస్తాం
మా గుడిలో దైవ ప్రార్థన చేస్తాం
మా గుడి పూజారిని కలుస్తాం
మా భక్త జనులను పిలుస్తాం
మేం శివ సత్తులను పిలిపిస్తాం
మా అగరొత్తులను వెలిగిస్తాం !
బడిలో చదువులు చదువుతాం
వడి వడిగా మేము ఎదుగుతాం
గుడిలో భజనలు మేం జరిపిస్తాం
మడిజనులను ఇక మురిపిస్తాం!
నిత్యం గురువు మాట వింటం
సత్యం గురువే దిక్కని అంటం
గురుపత్నిని మాతని పిలుస్తాం
గురువే మాదైవం అని తలుస్తాం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి