అమ్మ అభిలాష:- --గద్వాల సోమన్న ,9966414580
గొప్పగా చదవాలి
జ్ఞానాన్ని పొందాలి
ఎవరెస్టు రీతిలో
బ్రతుకులో ఎదగాలి

శ్రమను ఆయుధంగా
చేసుకుని సాగాలి
ధైర్యాన్ని కవచంగా
తొడుక్కొని నడవాలి

సుగుణమే హారంగా
మెడలో ధరించాలి
ఆకాశం హద్దుగా
సాహసము చేయాలి

విజయానికి గుర్తుగా
చరిత్రలో మిగిలాలి
పదిమందికి స్ఫూర్తిగా
జగతిలో నిలవాలి


కామెంట్‌లు