మేము చిన్న పిల్లలం:- --గద్వాల సోమన్న ,9966414580
లేలేత కొమ్మలం
మాట్లాడే బొమ్మలం
చిన్నారి పిల్లలం
సన్నజాజి మొగ్గలం

విహరించే ఖగములం
చిగురించే తరువులం
ప్రకాశించు  భానులం
వికసించే పూవులం

కొమ్మ మీద గువ్వలం
అమ్మ ఒడిని పిల్లలం
రమళించే మువ్వలం
సెలయేరుల తరగలం

సదనంలో వెలుగులం
వదనంలో నగవులం
భారతి ప్రియ పుత్రులం
గగనంలో తారలం

బడికెళ్లే బాలలం
గుడిలోని ఇలవేల్పులం
వడి వడిగా వృద్ధినొందు
మడిలోని  చిరు మొలకలం

మేము చిన్న పిల్లలం
అందమైన పల్లెలం
తొలకరి చిరు జల్లులం
నింగిని హరివిల్లులం


కామెంట్‌లు