కాళిదాసు కావ్య రచనలు సేకరణ అచ్యుతునిరాజ్యశ్రీ

 కాళిదాసు  ఋతు సంహారం ,
మేఘదూతం కుమార సంభవం రఘువంశం అనే నాలుగు కావ్యాలు రాశాడు మొదటి రెండు ఖండకావ్యాలు అంటే చిన్నవి జీవితంలో ఒక సంఘటనను తీసుకుని వర్ణించినది కుమార సంభవం రఘువంశం మహా కావ్యాలు ఇవి చాలా పెద్దవిగా విస్తృత వర్ణనతో వర్ణనతో కూడినది రుతు సంహారం కాళిదాసు తొలి పుస్తకం ఇందులో ప్రకృతిలో ఉన్నటువంటి ఆరు ఋతువులను చాలా చక్కగా వర్ణించాడు ఇలా ఋతువర్ణన చేసిన తొలి కవి మహాకవి కాళిదాసు ఇది చదివిన తర్వాత హిందీ కవులు పన్నెండు నెలల్లో ఉన్న విశిష్టతను గూర్చి ఎన్నో కవితలు రాశారు ఇప్పుడు రుతుసంహారం గూర్చి చదువుకుందాం కవి ఒక్కొక్క రుతువు యొక్క విశిష్టతను తన ప్రేయసికి వర్ణిస్తాడు మొదటి ఋతువు గ్రీష్మం ఆ తర్వాత వర్షాకాలం శరదృతువు వసంత రుతువు ఇలా అన్ని ఋతువులను సాంగోపాంగంగా కవి చక్కగా వర్ణించాడు రెండవది మేఘ దూతం ఇదొక అమూల్యమైన ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన కావ్యం ఆంగ్ల రష్యన్ ఇతర విదేశీ భాషల్లో అనువాదం చేయబడింది మేఘ తూత ఖండ కావ్యం 150 శ్లోకాలు ఉన్నాయి పూర్వ మేఘ ఉత్తరమే ఘ అనే ఈ రెండు భాగాల్లో ప్రేమ సౌందర్యం విరహబాద చక్కగా వర్ణింపబడ్డాయి. దీని కథ ఏమంటే అలకాపురి రాజు కుబేరుడు దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు ఆ యక్షుడు ఒక తప్పు చేసినందుకు ఒక ఏడాది పాటు అతన్ని దేశ బహిష్కారం చేస్తాడు కుబేరుడు ఆ యక్షుడు రామగిరి కొండపై ఉంటూ తన భార్య యక్షిణి కి సందేశాలు పంపుతాడు.అలా 8నెలలు గడిచాయి. ఆషాడ మాసం వచ్చింది వాటిని చూస్తూ యక్షుడు ఆ మబ్బుల తోటి మీరు అలకాపురి దాకా వెళ్లి నా భార్యకు నా గోడు వినిపించండి అని బాధపడుతూ వర్ణిస్తాడు వింధ్యాచల కొండల నుంచి
హిమాలయ పర్వతాల దాకా దారిని తెలుపుతూ మధ్యలో వచ్చే నగరాలు ప్రాంతాలని చాలా అందంగా చిత్రీకరిస్తాడు యక్షుడు మొదట కుటజము అనే పూలతో పూలతో మేఘాన్ని పూజిస్తాడు దారిలో మాల్వా ఆమ్రకోట్ నర్మదా నది వర్ణన విధిషా నగర వర్ణన చేస్తాడు యక్షుడు ఉజ్జయిని నగరాన్ని కూడా ఎనిమిది శ్లోకాలు వర్ణించాడు ఓ మేఘమా అక్కడ మహాకాళ మందిరాన్ని దర్శించు అక్కడ గజ్జలు చప్పుడు విను అందమైన కన్యలు ఎంతో చక్కగా పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉంటారు ఆ తర్వాత గంభీరా నది కార్తికేయ మందిరం చంబల్ నది మందసౌ బ్రహ్మవత్త దేశాన్ని చూడు కురుక్షేత్రం సరస్వతీ గంగా నదుల మీదుగా హిమాలయాలకి సాగిపో హిమాలయాల మధ్యలో కుబేరుని అలకాపురి నగరం ఉంది మధ్యలో కొండలు నగరాలు పల్లెలు తోటలు కొండవాగులు అన్నీ ఎంతో హృద్యంగా పులకింపచేస్తాయి ఇక ఉత్తర మేఘ లో కాళిదాసు హిమాలయ పర్వతాలు అలకాపురి వర్ణన అద్భుతంగా చేస్తాడు బహుశా ఇది సుందర కాశ్మీరం అని భావన  కులు లోయ అని పరిశోధకులు విశ్లేషణ అలకాపురిలో ఎత్తైన భవనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి చలువరాల మందిరాలు అందంగా నవ యవ్వనంలో ఉండే జనాలు ఆకర్షణీయంగా కనబడతారు యక్షిణులు కమల కమలాలని అంటే తామర పువ్వులతో చేసిన నగలు ధరిస్తారు తమ జుట్టులో కొప్పులు పూలు తోరుగుకుంటారు తురుముకుంటారు. తమ నెత్తి మీద పాపిటిలో పూల చామంతి బిళ్ళలు పాపిడి బొట్టు ధరిస్తారు మొహంపై లోద్ర అనే పూ ల చూర్ణాన్ని పూసుకుంటారు ఇక్కడ శంకరుడు మహాదేవుడు పార్వతీ సమేతుడై విహరిస్తుంటాడు కుబేరుడు పెద్ద రాజభవనల్లో ఉంటాడు దీనికి ఉత్తర దిక్కున నా ఇల్లు ఉంది ఆ ఇంటి ముందు మందార వృక్షం ఉంది అది ఇప్పుడు పూలు పూస్తూ ఉంటుంది దగ్గర్లో చెరువులో కమలాలు వికసిస్తాయి మాధవీలతలతో కూడిన మండపంలో అశోక పకోల చెట్లు ఉన్నాయి వాటి మధ్య చలువ రాయి దిమ్మెపై విరహంతో నా భార్య ఏడుస్తూ ఉంటుంది బహుశా వీణపై విరహ గీతాన్ని పాడుతూ ఉంటుంది వెళ్లి ఆమెకు నా సందేశాన్ని వినిపించవా మేఘమా కన్నీటితో ఏడ్చే నా భార్యను ఓదార్చవా నేను ఎంతో బాధపడుతున్నానని గడువు ముగియగానే వచ్చి తనను కలుస్తానని నా భార్యకి చెప్పవా మేఘమా అని యక్షుడు ఇచ్చిన సందేశంతో ఈ మేఘ దూత కావ్యం ముగిసింది అందమైన ప్రకృతి వర్ణన ఆనాటి చెట్లు పూలను గురించి మనకి ఈ కావ్యం వల్ల అర్థం అవుతుంది🌷
కామెంట్‌లు