ఓం శివోహం ఓం శివోహం హర హర మహాదేవఓ శంకర హర హర మహాదేవరక్ష మామ్ రక్ష మాం, పాహిమాం పాహిమాం ఓం నమశ్శివాయమన్నులో మట్టై పోయే జీవితానికిఊపిరి నీవే శివయ్య కాపరి నీవేశివశివం శివం శివం అంటే ఉన్నానంటావయ్యాసర్వాంగ సుందరం నీ నామం! భజేహం!భజేహం భజేహం విభూతి రాయావిశ్వేశ్వరుడివి నీవేఅన్నీ వలదనీ బూడిదే నాకు పరమప్రీతికరమని ఆనందిస్తావు, జీవుడే సర్వమని!!తల పైన నెలవంక చిరు మందహాసాలఒకపక్క గంగమ్మ పరుగులిడుతుమెడలోని నాగాభరణం నవ్వుతుంటేడమరుకం త్రిశూలం ఆసరానీకనిఅలంకారలనీ చాటిచెబుతావే!!!సృష్టినే నీ చేత పట్టిన వాడా , ఏమి తెలియనిఅమాయకుడివా బాగు బాగుందిఎంత గడిసరివి అంతా నీదే కదా ఆదరించఏది లేదంటావు అంతా నీదే కదా!!!ఏమీ కాదంటావు కానీ కన్నీటితో తలుస్తేపరుగు పరుగున వస్తావు ఎంత మంచి వాడివి నా శివయ్యా !ఎంత మహిమాన్వితుడవు నా శివయ్యా! ఓం శివయ్యా !!
ఓం శివోహం:- కె.కె.తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి