గుల్జార్ ఉర్దూ కవితకు అనువాదం:- డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
 ఎంత సుదీర్ఘమైన నిశ్శబ్దంతో గడిపాను నేను,
తనతో ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నించాను.
ఏదైనా అడ్డుపడిందేమో ఆ క్షణం,
ఆ సమయానికి శక్తి నశించిందేమో,
అడుగుల ముద్రలు వస్తున్నట్లున్నాయి కాబోలు,
ఎక్కడో కమలం విచ్చుకుంటున్నది కాబోలు.

కామెంట్‌లు