న్యాయాలు-774
"అచింత్యాః ఖలు మేభావా నతాం స్తర్కేణ సాధయేత్ "న్యాయము
****
అచింత్యాః అనగా ఊహింపరాని.ఖలు అనగా నిశ్చయమును,ప్రార్థనమును,,తెలియగోరుటను,నిషేధమును, హేతువును తెలుపును,వాక్యాల కారముగ కూడ ప్రయుక్తము.భావా అనగా తలంపు, ఆలోచన.నత అనగా వంగినది, లోతైనది.కరేనా అనగా ప్రియమైన.సాధయేత్ అనగా సాధించాలి అని అర్థము.
చింతన చేయడానికి వీలులేని భావనలను గురించి వ్యర్థముగా తర్కము చేయకూడదు. ఈ జగత్తు ఎలా పుట్టినది?దీని కాధారమేమిటి? దీనికి నిమిత్త కారణమేమిటి? ఇది యెట్టి పరిణామము ను పొందుతుంది? ఈ మొదలయిన ప్రశ్నలకు సమాధానము దొరకదు.అందుచేత వాటిని ఆలోచించడము వ్యర్థము.
ఇలా ఆలోచించడం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి జగత్ సంబంధమైన మీమాంస , రెండవది కర్మ సంబంధమైనవి.
మీమాంస. మొదటి దానిలో ఈ విశ్వం లేదా ప్రపంచం ఎలా పుట్టిందనే ఆలోచన ఒకటైతే, మరొకటి మన ఆత్మ,, పరమాత్మ గురించి... ఆత్మ మరణించాక ఆత్మ ఎటు వెళ్తుంది? పరమాత్మలో ఎలా లీనమవుతుంది? ఈ అంశాలను గురించి వాదోపవాదాలతో సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం కంటే మన చుట్టూ ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుకోవచ్చు కదా! అనేది వారి అభిప్రాయము. మరి వాదములలో ఎక్కువగా చెట్టు ముందా? విత్తు ముందా? కోడి ముందా? గుడ్డు ముందా?"సృష్టి ఎలా పుట్టినది?... అనే వితండ వాదన వల్ల విషయం లోతుగా తెలియక పోవడంతో అనవసరమైన కాలయాపన తప్ప మరింకేం లేదు ఊహకందని వాటి గురించి ఆలోచిస్తూ చింతించవద్దు అనేది ఈ న్యాయమలోని అంతరార్థం.
ఎందుకంటే మన తాతలు తండ్రుల తరం నుండి ఇలాంటి సందేహాలూ వస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు ఎవరూ ఇదమిత్థంగా తేల్చి చెప్పలేదు. కాబట్టి అమూల్యమైన సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు, చేసే వాళ్ళని చూసి మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
అందుకే పెద్దలు చెప్పిన ప్రతిమాట హితోక్తియే అన్నది గ్రహించాలి. ఈ "అచింత్యాః ఖలు మేభావా నతాంస్తర్కేణ సాధయేత్" న్యాయము ద్వారా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదని తెలుసుకున్నాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి