తూరుపు రంగు ఎరుపెక్కే కొద్దీ
జారిపోయే చీకటి రేఖలు
మార్పు కోరిన మనసులోని
కరిగిపోతున్న కలతలే!
రంగులు నింపుకున్న మబ్బుల
ఆత్రం నిండిన ఎదురుచూపులు
మొదలవబోతున్న సరికొత్త
జీవనవిధానపు కోరికలే!
గతమెంత ఘనమైనా
వ్యధ నిండిన కథలైనా
కథ మారిన బ్రతుకుల
గడియ వేసిన తలుపులే!
చింత లేని జీవితాల
చిన్ని చిన్ని వేడుకలు
అంతులేని ఆనందాల
అంతరంగ తరంగాలే!
పెంచుకున్న మమతలు
పంచుకున్న భావాలు
ఎంచుకున్న సౌఖ్యాల
ఎల్లలెరుగని సంతోషాలే!
రేయి కమ్మిన నీలినీడల
ఛాయలన్నీ తొలగిపోయి
వేయి వెలుగుల వేకువలో
హాయి తెమ్మెర పలుకరించే
సరికొత్త ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి