ఆ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న సమయంలో భోజనం స్నేహితులు అంతా కలసి ఒకచోట కూర్చుని అలవాటు. కానీ ప్రహర్షితకు ఎవరితో కలవక ఒంటరిగా కూర్చుని తినడం అలవాటు. కానీ భోజనం తృప్తిగా తిన్న సందర్భాలు చాలా తక్కువ. కూర నచ్చలేదని పారేసే సందర్భాలు చాలా ఎక్కువ. ఇది ఒకరోజు శ్రుతి అనే అమ్మాయి గమనించినది. ప్రహర్షిత వద్దకు వెళ్ళి, కారణం కనుక్కుంది. "అలా కూర నచ్చలేదని వృథాగా పారవేయడమ ఎందుకు? రేపటి నుంచి నీతో కలసి కూర్చుంటాను. నీకు కూర నచ్చనప్పుడల్లా నాకు వడ్డించు." అన్నది శ్రుతి. "బాబోయ్! ఆ కూరలు నువ్వు తినలేవు." అన్నది ప్రహర్షిత. "నేను తింటాను. చూడు." అన్నది శ్రుతి.
ప్రహర్షిత తనకు నచ్చని కూర ఉన్నప్పుడల్లా శ్రుతికి కూర ఇచ్చేది. శ్రుతి ఆ కూరలు తింటూ "అబ్బా! ఎంత రుచిగా ఉందో కూర." అంటూ లొట్టలేసుకుంటూ తినేది. ఇంకొక అమ్మాయి హిమబిందు "నాక్కూడా" అంటూ పెట్టించుకొని తింటూ "అమృతం లాగా ఉంది." అనేది. ప్రహర్షిత ఆశ్చర్యపోయేది. ప్రతీసారీ ఇలానే జరిగేది. ప్రహర్షితకు అనుమానం వచ్చింది, వీళ్ళు కావాలని అబద్దం చెబుతున్నారా? అని. మళ్ళీ అనుకునేది. కావాలని అబద్దం చెపితే అంత కూరను ఎలా తినగలుగుతున్నారు? అని. వీళ్ళకు ఇంత బాగా ఎందుకు నచ్చిందా! అని ఆశ్చర్యం వేసింది.
ఒకరోజు అడిగింది. అప్పుడు శ్రుతి ఇలా అన్నది. "బాగా ఆకలిగా ఉన్నవారికే తెలుస్తుంది అన్నం విలువ. మేము నిరుపేదలం. ఎక్కువ శాతం పచ్చడి అన్నమే తింటాను. కూరల విలువ నాకు తెలుసు. ఆకలిగొన్న వారికే ఏదైనా రుచిస్తూంది. కడుపు నిండిన వారికి అన్నీ చేదే. అయినా ఈ కాలం పిల్లలు అమ్మా నాన్నలను తరచూ డబ్బులు అడుగుతూ బయట షాపుల్లో అడ్డమైన చిరుతిండ్లు తింటున్నారు. వాటితో రకరకాల రోగాలు వస్తాయి. అన్నం సహించదు. ఆ చిరుతిళ్లకు పెట్టే డబ్బులతో రకరకాల పండ్లను తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఇలాగే రోజూ కూరలు నచ్చలేదని ఏమీ తినకపోతే అనారోగ్యంతో తొందరగా పైకి పోతావు జాగ్రత్త." అని. "మా ఇంట్లో చిరుతిళ్లపై నిషేధం. మా నాయనమ్మ ఆరోగ్యానికి ఏవి మంచివో ఎప్పుడూ చెబుతుంది. ఎప్పుడూ ఇంట్లో రకరకాల పళ్ళు ఉంటాయి. ఇష్టంగా తింటాము." అన్నది హిమబిందు.
"మీ అమ్మ వండిన ఆరోగ్యకరమైన కూరలు పారేస్తున్నావు. బయట ఎవరో తయారు చేసిన అడ్డమైన చిరుతిళ్లను తింటున్నావు. నీ అమ్మ మీద నీకు ప్రేమ లేదా?" అన్నది శ్రుతి. ప్రహర్షిత ఆలోచనలో పడింది.
"సరే! మీరు చెప్పినట్లు వింటా. రేపటి నుంచి మనం అంతా కలసి తిందాం." అన్నది ప్రహర్షిత. అలాగే అన్నారు ఇద్దరూ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి