సుప్రభాత కవిత : - బృంద
సర్వ విధ శక్తులకు 
ఆధారభూతమై
అనితర సాధ్యమై
అవనిని ఏలే ఆదిత్యుడు..

సకల జీవరాశికీ 
అన్నపానాదులను 
అహర్నిశలూ అందిస్తూ 
ఆదరించే భగవానుడు

ఋతువులకు కారణమై
క్రతువుగా లోకక్షేమముకై 
కాలచక్రమును నడిపిస్తూ 
జగమును కాచే జగద్రక్షకుడు..

తమస్సును తరిమేసి 
ఉషస్సులతో  ఊపిరిపోసి 
వసుధను సంయమనాన 
సంరక్షించే సమవర్తి.

ఎల్లవేళలందు సకలజీవుల 
ఆరోగ్యప్రదాతయై 
ఉర్వినెల్ల  స్వస్థముగ 
ఉంచు హిరణ్మయుడు

ప్రాణదాతగా  కాంతినేతగా
వ్యోమనాథుడై రశ్మి మంతుడై
రోగ ప్రశమనుడై  పాప ప్రనాశుడై 
శతృవినాశుడై  లోకసాక్షి గా నిలిచి 

సర్వదేవాత్మకుడై 
సకల శుభకరుడై
సప్తాశ్వరథమునధిరోహించి 
సర్వ జగద్రక్షణ  వహించు 

ప్రత్యక్ష నారాయణుడికి 
నమస్కారాలతో 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు