విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయ వ్యవస్థలో పేరుకు పోయి ఉన్న అనేక అపరిష్కృత సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి అన్నారు. కొత్తూరు, హిరమండలం, లక్ష్మీనర్సుపేట మండలాల్లో పర్యటించి పలుచోట్ల ఆమె ప్రసంగించారు. కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మెట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హిరమండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, లక్ష్మీనర్సుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కరకవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పర్యటించి ఉపాధ్యాయులతో, లెక్చరర్లతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఒకటో నెంబర్ లో గల తనకు మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి, కేజీబీవీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయనిల మినిమం టైమ్ స్కేలుని సాధించి ఉద్యోగ భద్రత కల్పించుటలనేవి మొదటి ప్రాధాన్యతా అంశాలుగా చేసుకొని కృషి చేస్తానని అన్నారు. గత ప్రభుత్వం గానీ, ప్రస్తుత ప్రభుత్వం గానీ తీసుకొస్తున్న విద్యాసంస్కరణల వల్ల వేలాది పాఠశాలలు మూతపడడమే కాకుండా, వేలాది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల, స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు మిగిలిపోయే ప్రమాదం ఉందని తద్వారా భవిష్యత్తు నియామకాలు, పదోన్నతులు ప్రశ్నార్థకమౌతున్నాయని, నిర్మాణాత్మక సూచనలు చేసి పరిష్కారదిశగా అడుగులు వేస్తానని విజయగౌరి అన్నారు. తన 34 సంవత్సరాల సర్వీసులో ఉపాధ్యాయుల సంక్షేమానికై కృషి చేస్తూ, ఉద్యమాలతోనే నడిచానని ఆమె గుర్తుచేశారు. తనను గెలిపించి శాసనమండలికి పంపిస్తే మండలిలో ఉపాధ్యాయ, అధ్యాపకుల వాణి వినిపించే గొంతునౌతానని అన్నారు.
ఈ పర్యటనలో కోరెడ్ల విజయగౌరి వెంట ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం (యుటీఏఫ్) రాష్ట్ర కౌన్సిలర్ దండు ప్రకాశరావు, జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు, జి.శ్రీరామచంద్రమూర్తి, మహిళా నేతలు డి.స్వర్ణలత, ఆర్.జ్యోతి, యన్.లలితకుమారి, పి.వాణి, బి.రోజా, సంఘనేతలు కె.విజయకుమార్,
వి.మధుసూదనరావు, కె.బాలకృష్ణ, ఆర్.భుజంగరావు, రామకృష్ణ, బి.సంతోష్ కుమార్, యన్.కోటేశ్వరరావు, చిన్నారావు, పి.చిన్నారావు, టి.రవి, యస్.డిల్లేశ్వరరావు, యన్.శంకరరావు, జిల్లా కౌన్సిలర్లు కుదమ తిరుమలరావు, తూతిక సురేష్ తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి