శివానందలహరి:- కొప్పరపు తాయారు.

 శ్లోకం: 
    ధైర్యాంకుశేన నిభృతం
రభసాదాకృష్య భక్తి శృంఖలయా !
   పురహర  చరణాలావే
హృదయమదేభం  బధాన చిద్యంత్రైః !!

భావం:
మనసునే మదపుటేనుగును, ధైర్యమనే అంకుశం తో  కదలనీయక,భక్తి అనే
గొలుసులతో బలంగా లాగి శివుని
పాదములనే  కట్టుస్తంభమునందు బుద్ధి అనే యంత్రములతో బంధించుము.
                    *****

కామెంట్‌లు