పుస్తక ఆవిష్కరణ :- ఆర్ సి కృష్ణస్వామి రాజు, తిరుపతి
 తిరుపతి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో 16/02/2025 న ఆర్సీ కృష్ణస్వామి రాజు రచించిన ‘మీది తెనాలి-మాది తెనాలి’ హాస్యకథల సంపుటి ఆవిష్కరింపబడింది.
ఈ కార్యక్రమలో శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జంపాల వెంకట రమణ, హాస్యానందం పత్రిక ఎడిటర్ పి.రాము, భాషావేత్త ఆచార్య మూలె విజయలక్ష్మి, కడప సి.పి.బ్రౌన్ పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి పాల్గొన్నారు.
జూనియర్ ఛాంబర్ అధ్యక్షులు ఆర్.శేషసాయి, కార్యదర్శి వి.దిలీప్ కుమార్, కోశాధికారి ఎం. దిలీప్ కుమార్ రెడ్డి లు ఈ కార్యక్రమం నిర్వహించారు.

కామెంట్‌లు