అప్పటికప్పుడే చందోబద్ధమైన సాహిత్యంతో పద్యం రాసి అలరించడమే కాకుండా సుమారు 500 కు పైగా బాలల కథలు రాసి, తెలుగు సాహిత్యంలో మెప్పించి మాతృభాష పరిరక్షణకై అహర్నిశలు కృషి చేస్తున్న రచయిత ఉండ్రాళ్ళ రాజేశం. ఎప్పుడు ఎక్కడో ఒక చోట సాహిత్య కార్యక్రమాలు, గోష్ఠులు, పుస్తకావిష్కరణలు, అష్టావధానాలు అంటూ ఇలా అనేక కార్యక్రమాలు పాల్గొంటూ నిర్వహిస్తూ తెలుగు భాషా వికాసానికై కంకణం కట్టుకున్న రచయితగా ఉండ్రాళ్ళ రాజేశం రాష్ట్రస్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన రాజేశం నేడు సాహిత్యంలో అగ్రగామిగా సాగుతున్నాడు. పురస్కారాలు, అవార్డులు, సత్కారాలకు మురిసిపోకుండా తనతో పది మందిని సాహిత్యం వైపు తీసుకవెళ్తున్నా నిత్య సాహిత్య సంచారి రాజేశం.
ముఖ్యంగా బాల సాహిత్యం కోసం వివిధ కార్యక్రమాలు చేస్తూనే కార్యశాలల్లో పాల్గొంటూ బాలల వికాసానికై రాష్ట్రస్థాయి బాలసాహిత్య రచనలు ప్రోత్సహిస్తూ బాల కవులను సమాజానికి అందించేందుకు రాజేశం కృషి చేస్తున్నాడు. తాను రాసే ప్రతి రచన కూడా బాలల వైపు మలుపు తిప్పేదిగా సాగుతుంది. పద్యం రాసిన కథ రాసిన గేయం రాసిన పాట రాసిన కవిత్వమైన బాలల వికాసానికైతే తోడ్పడేలా ఉంటుంది. సుమారు 20 పుస్తకాలు సాహితీ లోకానికి అందెందుకు ప్రచురించి అందజేసిన దీశాలి ఉండ్రాళ్ళ రాజేశం. ఏది ఏమైనా బాలలు చిన్నప్పుడే సాహిత్యం ద్వారా మంచి మార్గం వైపు నడిచేందుకు రాజేశం చేస్తున్న కృషి అభినందనీయం. మాతృభాష పరిమళాలు బాలల లోకానికి అందేలా రాజేషంను ఆశీర్వదిద్దాం...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి