మోసకారి మాటలు :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
కులం కులం అంటారు 
కలతలేమో పెడుతారు
జాతీ మతం అంటారు 
చిచ్చు వారు పెడతారు 

దొంగా దొరా అంటారు 
దోచుకుని పోతారు 
రాజులం మేము అంటూ 
ఫోజులే కొడతారు వారు 

వెనుక వెనుక నడుస్తారు 
వెన్నుపోటు పొడుస్తారు 
నట్ట నడుమ నిలుస్తారు 
నడ్డి వారు విరుస్తారు 

అప్పు సప్పు అంటారు 
నిప్పు వారు రగిలిస్తారు 
చిన్నగా పొగుడుతూ
వెనక ముళ్ళు గుచ్చుతారు 


కామెంట్‌లు