పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాల 8వ తరగతి బాలిక పతివాడ హరిణి ఎన్.ఎం.ఎం.ఎస్. పరీక్షలో ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు తెలిపారు. గతేడాది డిసెంబర్ 8వ తేదీన టెక్కలిలో జరిగిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్.ఎం.ఎం.ఎస్) పరీక్షలకు హాజరైన హరిణి, ఫిమేల్ విభాగంలో జిల్లా స్థాయి 21వర్యాంకు సాధించుకుని, స్కాలర్ షిప్ కు అర్హత పొందింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ విడుదల చేసిన జాబితాలో హరిణికి స్థానం లభించింది. ఈ ప్రతిభ కనబరిచిన హరిణికి నాలుగేళ్ల పాటు ఒక్కో ఏడాదికి పద్నాలుగు వేల రూపాయలు చొప్పున ఏభై ఆరువేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందజేయనున్నట్లు కృష్ణారావు తెలిపారు. ఇదే పాఠశాల బాలిక పతివాడ కుసుమ రెండేళ్ల క్రితం కూడా ఈ ఎన్ఎంఎంఎస్ కు ఎంపిక కాగా, నేడు హరిణి ఎంపికై తమకెంతో గర్వకారణంగా నిలిచారని ఆయన అన్నారు. హరిణిని అభినందిస్తూ శాలువా, జ్ఞాపికలతో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. గతేడాది డిసెంబర్ 24న కొత్తూరు కె.జి.బి.వి.లో జరిగిన మండల స్థాయి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ లో కూడా ఈ పాఠశాల రూపొందించిన బయోగ్యాస్ ప్రోజెక్ట్ కు ప్రథమ బహుమతి పొందగా, ఈ నెల 9న కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన మండల స్థాయి గణిత శాస్త్ర క్విజ్ పోటీల్లో కూడా తమ ప్రతిభను కనబరిచిన ఈ పాఠశాల విద్యార్థులు కన్సోలేషన్ స్థానంలో నిలిచారు. ఎన్ ఎం ఎం ఎస్ కు ఎంపికైన పతివాడ హరిణిని అభినందించే కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, బూడిద సంతోష్ కుమార్, పైసక్కి చంద్రశేఖరం, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులు పాల్గొన్నారు.
పాతపొన్నుటూరు హరిణికి ఎన్.ఎం.ఎం.ఎస్. ర్యాంక్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి