ఘనాపాటి .....!! --డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 ఆడుకోడానికి 
కాదేదీ అనర్హం అన్నట్టు 
ఇంట్లోని ప్రతివస్తువూ 
ఆటవస్తువే మా ' నికో 'కి !
కనపడిందల్లా 
హాల్లోకి తెచ్చి ఆడతాడు 
ఆటయిపోగానే ...
ఎక్కడివస్తువు ---
అక్కడ పెట్టెస్తాడు ....
చప్పట్ల కోసం మావంక 
ఎగాదిగా చూస్తాడు !
కొత్తఆటలు -
కనిపెట్టడం .....
మా నివిన్ ప్రత్యేకత !
ఆటల్లో బహుమేటి ...
అతగాడు ఘనాపాటి !!
                ***
కామెంట్‌లు