కులం అంటే నివాసం అని అర్ధం.కొన్ని వృత్తులు కొన్ని నివాసాలకే పరిమితమై కులాలుగా పరిగణింపబడి కులతత్వం రాజకీయ అరంగేట్రం చేసింది.భగవద్గీత ప్రబోధించేది సనాతన వర్ణాశ్రమవ్యవస్థ. వర్ణాలంటే వృత్తులు! ప్రపంచంలో దేవ మనుష్య తిర్యక్ స్థావరాలు అనే నాలుగు వర్ణాలున్నాయి. వ్యవసాయం పరిశ్రమలు రాజకీయం నేడు వృత్తులుగా మారాయి.అందుకే రామానుజదర్శనంలో కులమత ప్రస్తావన లేదు.ఏవర్ణం వారైనా శ్రీవైష్ణవులుగా సహజీవనం భగవదనుగ్రహంకి అర్హులే!దేవుడు నల్లగా ఉంటాడు.నీలమేఘశ్యాముడు అని రాముని నల్లనయ్య అని కృష్ణుని కాళికాదేవి కారు నలుపు అని భక్తుల భావన! స్వామీవివేకానందను అమెరికాలో కొందరు ప్రశ్నిస్తే ఆయన జవాబిది" అనంత కల్యాణ గుణాలన్నీ నల్లగా ఎలాంటి మచ్చ మరకలు కనపడకుండా ఉంటాయి.భగవంతుడు నిరాకారుడు.భావన భక్తి ముఖ్యం". స్వామీవివేకానంద అదే ప్రశ్నను మద్రాస్ లో ఓబడిలో సంధిస్తే ఓకుర్రాడిచ్చిన జవాబిది"ఆకాశం అంబుధి నల్లగా కన్పడ్తాయి.అనంత తత్వం నలుపు."స్వామీ ఆపిల్లాడ్ని అభినందించారు.ఆవిద్యార్థి రాజాజీ గా పేరొందిన చక్రవర్తుల రాజగోపాలాచారి గాంధీజీ వియ్యంకుడు.మనిషికి అహం గర్వం పతనంకి దారి.శ్రీరామానుజాచార్యులవారు నల్లోర్ అనే ప్రాంతంలో ఆగారు. ఓవ్యక్తి కాచిన పాలు తెచ్చి ఇవ్వగానే దైవంకి నైవేద్యం పెట్టి ఆనందంగా తాగారు ఆయన. రెండోసారి గర్వంతో" ఆచార్యులు నేనిచ్చినపాలు తాగాడు" అని అందరికీ డప్పుకొట్టి తెస్తే ఆయన స్వీకరించలేదు. మనం చేసే సాయంని గొప్పగా డబ్బాకొట్టడం మంచిది కాదు.దానధర్మాలు కూడా వేరేవారికి తెలిసేలా చెప్పటం అనవసరం.నిష్కళంకమైన మనసుతో మాట సాయం చేసినా చాలు🌷
తెలుసుకుందాం! సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి