ఉగాది బాలల కథల పోటీకి అపూర్వ స్పందన

 సిద్దిపేట కు చెందిన సుగుణ సాహితి సమితి  ఉగాది సందర్భంగా ప్రభుత్వ మరియు ప్రయివేటు పాఠశాలల విద్యార్థుల నుండి జిల్లా స్థాయి బాలల కథల పోటీ -2025 కి కథలు ఆహ్వానించగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 29 పాఠశాలల నుండి 372 కథలు రావడం సంతోషంగా ఉందని సుగుణ సాహితి సమితి కన్వీనర్ భైతి దుర్గయ్య బుధవారం  సిద్దిపేటలో కథల వివరాలు ప్రకటించారు. లక్ష్మీదేవిపల్లి -08, సిర్సన గండ్ల -1,
జక్కాపూర్ -17,రామునిపట్ల-4, కుకునూరుపల్లి-10, కొండపాక బాలికలు -8,సికింధ్లాపూర్-2, బెజ్జంకి - 10,శనిగరం-55,ఆదర్శ పాఠశాల బెజ్జంకి -19- బక్రిచెప్యాల-20, రేగులపల్లి-9 అనంత సాగర్ -22,మర్పడగ-3, రామంచ-20, రాజ గోపాల పేట-14, ఎల్లా రెడ్డి పేట-34,చౌడారం -4,సముద్రాల-2, దౌల్తాబాద్ -19,ఘన పూర్ -22, నర్సాయపల్లి -9,ఎన్సాన్ పల్లి -3,శ్రీగిరిపల్లి -22,చిన్నకోడూర్ -20,చందాపూర్ -12,వెంకట్రావు పేట -1 ప్రభుత్వ పాఠశాలతో పాటు ,మెరిడియన్ -1,శ్రీ చైతన్య స్కూలు -1కథలు వచ్చాయని ,గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువగా కథలు వచ్చాయని,ఈ కథలు న్యాయ నిర్ణేతలకు పంపించి మార్చ్ నెలాఖరు లో ఫలితాలు ప్రకటించి,బహుమతులు అందిస్తామని కన్వీనర్ చెప్పారు.కథలు వ్రాసిన చిన్నారులు,వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులు,తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు  చెప్పారు.
కామెంట్‌లు