సరస్వతీమాత పుట్టిన రోజు మాఘశుక్ల పంచమిని 'శ్రీపంచమి', లేదా 'వసంతపంచమి' అని కూడా అంటారు. ఈ దేవి శాంతమూర్తియై ఒక చేత వీణ, మరో చేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. సరస్వతీదేవి పరబ్రహ్మయైన పరమాత్మ నుంచి ఉద్భవించిన వాణి, విద్య, జ్ఞాన, బుద్దులకు ప్రతీక. అటువంటి జ్ఞాన ప్రదాయిని కరుణ ఉంటేనే విద్యాప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి కలుగుతుందని పురాణవచనం.
సకల విధులకు అధిపతి అయినవాడు శివుడు. ఈ విద్యలను సరస్వతీ దేవికి ప్రధానం చేసి బ్రహ్మ నాలుకపై శాశ్వతంగా నశించమని ఆదేశించాడు. బ్రహ్మకు తోడై నిలిచిన సరస్వతి సకల విద్యలకు రాణి వేదమాతా రూపంలో నిలిచింది. శ్రీ పంచమి నాడు అక్షరాభ్యాసం చేయిస్తే అపారమైన జ్ఞానం లభిస్తుందని విద్య అభివృద్ధి చెందుతుందని విశ్వాసం. అందుకే శ్రీ పంచమి నాడు దేశవ్యాప్తంగా బాల బాలికలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. శ్రీ పంచమి విద్యారంభ తినమని వాగ్దేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చేయాలని విద్యార్థి ప్రారంభించాలని బ్రహ్మ వైవర్త పురాణంలో పేర్కొనబడినది. ఈరోజు విద్యార్థులకు పుస్తకాలు పలకలు, కలాలు వంటివి ఇవ్వడం వలన చక్కటి పుణ్యఫలాలు పొందుతారని శాస్త్రాలలో విషయకరించబడినది.
భారతీయులు వేద కాలము నుండి శ్రీ పంచమిని జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రపంచంలో విద్య అని చెప్పబడే సర్వానికీ అధిష్టాత్రి సరస్వతి. విద్యలలో పొందాలనుకునే మానవుడు తప్పనిసరిగా సరస్వతి దేవిని శరణార్థుడై వేడుకోవలసిందే. మానవుడు ఉపేక్షించ కూడనిది జ్ఞానం సరస్వతి దేవి ఆరాధన ద్వారానే అది సాధ్యం. వసంత పంచమికి అధిదేవత సరస్వతి. వసంత రుతువు ప్రారంభంలో శుక్లపక్ష పంచమి నాడు శ్రీ పంచమి లేదా వసంత పంచమి అని జరుపుతారు. సరస్వతీ దేవికి చేసే అతి ముఖ్యమైన పూజలలో ఇది ఒకటి.
సృష్టికి పూర్వం అంతా జలమయం అని చెప్ప బడింది. 'సరస్వతి' అంటే జలము కలది అని అర్థము. ఇది నదీ వాచకము. నది- ప్రవాహ రూపం, జలములకు, 'సరణాత్' అను పదానికి జీవనమని పేరు. అంటే జీవన ప్రవాహమే- సరస్వ తీమాత. విశ్వమందలి సర్వభూతములు, ప్రాణము, అన్నము, అమృతము, వేదములు, సర్వదేవతలు, ప్రణవము- అన్నీ స్వరూపం అంటే మహాసరస్వతీ స్వరూపం. ఇతిహాస పురాణాలు మహాకావ్యాలు అంతా సరస్వతి స్వరూపం.
'సరః' పదము సంచరించు ధాతువు నుండి వ్యుత్పన్నమైంది. అది తేజస్సుకు, కాంతికి సంబం ధించినదని మరియొక అర్థం. వాగ్దేవత మేధాశ క్తిని, బుద్ధిని, విద్యను, జ్ఞానమును ప్రసాదించు నదై, సమస్త విద్యాస్వరూపిణియై తనను భక్తితో ఆరాధించేవారికి, యుక్తాయుక్త పరిజ్ఞానమును, వివేచనాశక్తిని, జ్ఞాపకశక్తిని, కల్పనాసామర్థ్యాన్ని, కవితా స్ఫూర్తిని, గ్రంథ రచనాశక్తినీ, ధారణాశక్తినీ, ప్రసాదించునట్టి జగన్మాత మహాసరస్వతి అని, దేవీ భాగవతము చెస్తోంది.
జ్ఞానమే అన్ని సంపదలకు మూలమని తెలిసిన మానవజాతి మాఘశుద్ధ పంచమినాడు 'వాగ్భూషణమ్ భూషణమ్'- మానవునకు 'మంచి మాటే' అలంకారము కనుక వాక్కును ప్రసాదించే దేవతగా సరస్వతీదేవిని ఉపాసించి, వాక్సంపదను పొందడానికి శారదాంబనే 'వాగ్దేవి'గా సంభావిస్తారు. అఖిల లోకాలకు జ్ఞానప్రదా యిని అయిన సరస్వతీ మాతను వారు వీరనే తారతమ్యాలు లేకుండా పూజిస్తారు. శుద్ధసత్వగుణరూపిణి అయిన సరస్వతీ మాత శ్వేతాలంకారప్రియ గా భావిస్తారు. "చంద్రికా చంద్రవదనా తీవ్ర మహా భద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా" అని జ్ఞాన ప్రదాయినిగా కొలువబడుతున్న శారదాంబను, బ్రహ్మ దేవుని ఇల్లాలిగా హంసవాహినిగా అలంకరించి "వాగేశ్వరీ, వాగ్వాదినీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, నకులీ సరస్వతి, పరాసరస్వతి, బాలాసర స్వతి'గా కొనియాడు తారు. 'సరస్వతీ రహస్యోపనిషత్' ద్వారా అశ్వలాయనుడు సరస్వతీ కటాక్షంతో పొందిన అపార జ్ఞానసంపద వివరణతో సరస్వతిని ఉపాసిస్తారు. బుద్ధి, జ్ఞానశక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి 'సరస్వతి' కనుక 'శ్రీపంచమి' న విశేషంగా ఈ తల్లిని ఆర్పించి ఆమె కృపకు పాత్రులై తరించడానికి సులభోపాయంగా చెప్తారు. సరస్వతీ దేవి శాంతమూర్తియై ఒకచేత వీణ, మరో చేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి వుంటుంది ఈ తల్లిని దేవీ భాగవతం బ్రహ్మవైవర్తన పురాణాదులు చదువుల తల్లిగా ఆరాధించమంటున్నాయి.
ఓసారి వేదవ్యాసుల వారు అదిలాబాద్ జిల్లాలో గోదావరి తీరాన బాసర క్షేత్రంలో జ్ఞానరూపిణి యైన సరస్వతీ దేవికోసంతపమాచరించాడట. ఆ తల్లి ఆ వ్యాసుని తపస్సుకు మెచ్చి ప్రత్యక్ష మయిందట.
జ్ఞానమే అన్ని సంపదలకు మూలమని తెలిసిన మాన ఇవజాతి మాఘశుద్ధ పంచమినాడు 'వాగ్భూషణమ్ భూషణమ్'- మానవునకు 'మంచి మాటే' అలంకారము కనుక వాక్కును ప్రసాదించే దేవతగా సరస్వతీదేవిని ఉపాసించి, వాక్సంపదను పొందడానికి శారదాంబనే 'వాగ్దేవి'గా సంభావిస్తారు. అఖిల లోకాలకు జ్ఞానప్రదా యిని అయిన సరస్వతీ మాతను వారు వీరనే తారతమ్యాలు లేకుండా పూజిస్తారు. శుద్ధసత్వగుణరూపిణి అయిన సరస్వతీ మాత శ్వేతాలంకారప్రియగా భావిస్తారు. "చంద్రికా చంద్రవదనా తీవ్ర మహా భద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా" అని జ్ఞాన ప్రదాయినిగా కొలువబడుతున్న శారదాంబను, బ్రహ్మ దేవుని ఇల్లాలిగా హంసవాహినిగా అలంకరించి "వాగేశ్వరీ, వాగ్వాదినీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, నకులీ సరస్వతి, పరాసరస్వతి, బాలాసర స్వతి'గా కొనియాడు తారు. 'సరస్వతీ రహస్యోపనిషత్' ద్వారా అశ్వలాయనుడు సరస్వతీ కటాక్షంతో పొందిన అపార జ్ఞానసంపద వివరణతో సరస్వతిని ఉపాసిస్తారు. బుద్ధి, జ్ఞానశక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి 'సర స్వతి' కనుక 'శ్రీపంచమి' న విశేషంగా ఈ తల్లిని ఆర్పించి ఆమె కృపకు పాత్రులై తరించడానికి సులభోపాయంగా చెప్తారు. సరస్వతీ దేవి శాంతమూర్తియై ఒకచేత వీణ, మరో చేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి వుంటుంది ఈ తల్లిని దేవీ భాగవతం బ్రహ్మవైవర్తన పురాణాదులు చదువుల తల్లిగా ఆరాధించమంటున్నాయి.
ఓసారి వేదవ్యాసుల వారు అదిలాబాద్ జిల్లాలో గోదావరి తీరాన బాసర క్షేత్రంలో జ్ఞానరూపిణి యైన సరస్వతీ దేవికోసంతపమాచరించాడట. ఆ తల్లి ఆ వ్యాసుని తపస్సుకు మెచ్చి ప్రత్యక్ష మయిందట. తల్లి అనుగ్రహంతోనే ఆయన రచనకు పూనుకొన్నాడు.
కలియుగంలోని మానవులు కూడా ఈ తల్లి అనుగ్రహాన్ని పొందాలని ఆశించిన ఆ వేదవ్యాసుడే తల్లిని సైకత స్వరూపిణిగా ఈ బాసరలో ప్రతిష్టించాడు. సుప్రతిష్టమైన ఈ బాసర అక్షరాభ్యాసాలకు నెలవైంది. ఈ తల్లి ముందు కూర్చుని అక్షరాభ్యాసం చేయించిన పిల్లలు అపార జ్ఞానసంపదకు వారసులవుతారని సరస్వతీ కొలువై ఉన్న ఆలయాల్లో పిల్లలకు అక్షర అభ్యాసం జరిపిస్తే వారు విద్యలో బాగా రాణిస్తారని భక్తుల నమ్మిక. ప్రతి వారికి ఉండే విశ్వాసం వల్ల కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల చేత సరస్వతి దేవి ఆలయంలో ప్రథమంగా అక్షరాలు దిద్దిస్తారు 'పుణ్యగోదావరి తీరంలోని ఇసుకను తెచ్చి అమ్మనుప్రార్ధించి ఇక్కడే కొలువైన సరస్వతీ అమ్మతోపాటుగా మహాలక్ష్మి దేవి కూడా ఈ ఆలయంలోనే కొలువైఉన్నారు. ఈ ఇద్దరు అమ్మలతోటి ఆలయానికి పశ్చిమ భాగంలో మహాకాళి అమ్మవారు, తూర్పున దత్తాత్రేయులు కూడా విచ్చేసి బాసరను దర్శించిన భక్తులకు దర్శనం కలుగ చేస్తుంటారు. వీరందరి దర్శనంతో అటు జ్ఞాన ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు అంటారు. అంతేకాక బాసరను విజ్ఞాన క్షేత్రంగా విలసిల్లడానికి కారణమైన వేద వ్యాసుల విగ్రహాన్నికూడా తయారు చేయించి ప్రధాన రహదారి వద్దనే ఆలయాన్ని నిర్మించి వేద వ్యాసుల మూర్తిని ప్రతిష్టించి ఉన్నారు.
మాఘశుద్ధ పంచమి నాడు వసంత పంచమి పేరిట విశేష పూజలు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు తరలి వస్తారు. ఈ మాఘమాసం శిష్యులతో వసంతాగమనం కనుక సర్వులలో నవ చైతన్య దీప్తిని కలుగజేసే వసంతుని ప్రతి దేవిని కూడా ఈ పంచమి నాడే పూజిస్తారు. సరస్వతీ దేవి పూజ ఎటు వసంతని పూజ చేయడంలోనే అంతరార్థం గ్రహించాలనిదే ఈ పర్వ విశేషం. శ్రీ పంచమి నాడు సరస్వతీ దేవిని పూజించి పిల్లల అక్షరాభ్యాసానికి ఈరోజు ఎంతో శ్రేష్టం మల్లెపూలతో ఈ చదువుల తల్లిని పూజిస్తే ఈమె కృప లభిస్తుంది.
మాఘశుద్ధ పంచమి నాడు వసంత పంచమి పేరిట విశేష పూజలు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు తరలి వస్తారు. ఈ మాఘమాసం శిష్యులతో వసంతాగమనం కనుక సర్వులలో నవ చైతన్య దీప్తిని కలుగజేసే వసంతుని ప్రతి దేవిని కూడా ఈ పంచమి నాడే పూజిస్తారు. సరస్వతీ దేవి పూజ ఎటు వసంతని పూజ చేయడంలోనే అంతరార్థం గ్రహించాలనిదే ఈ పర్వ విశేషం. శ్రీ పంచమి నాడు సరస్వతీ దేవిని పూజించి పిల్లల అక్షరాభ్యాసానికి ఈరోజు ఎంతో శ్రేష్టం మల్లెపూలతో ఈ చదువుల తల్లిని పూజిస్తే ఈమె కృప లభిస్తుంది. కా మీ తాత ప్రధానిగా బాసర జ్ఞాన సరస్వతి శ్రీ పంచమి నాడు విశేష పూజలు అందుకుంటుంది.
" కావ్యసుధ "
'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'
" ఆధ్యాత్మిక సాహితీ వ్యాస భూషణ్ "
9247313488 హైదరాబాదు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి