జాగరణ : సరికొండ శ్రీనివాసరాజు
 రెండు రోజుల సెలవుల తర్వాత పాఠశాల ప్రారంభం అయింది. క్లాస్ టీచర్ రామకృష్ణ గారు పిల్లలతో మాట్లాడుతున్నారు. శివరాత్రి రోజు రాత్రంతా మేలుకొని జాగరణ చేసిన వాళ్ళు ఎంతమంది అని అడిగారు ఉపాధ్యాయులు. కొంతమంది చేతులు ఎత్తారు. ఆ చేతులు ఎత్తిన వారిలో మహేశ్ అనే విద్యార్థి "మిగతా వారికి భక్తి లేదన్న మాట." అంటూ నవ్వాడు. అప్పుడు ఉపాధ్యాయులు "మహేశ్! రాత్రి అంతా నిద్ర లేచి ఏం చెసినావు." అన్నారు. టీవీలలో ఎంటర్టెయిన్మెంట్ ప్రొగ్రామ్స్ చూసాను తెల్లవార్లు." అన్నాడు. అప్పుడు రాజేశ్ అనే విద్యార్థి లేచి, "నేనైతే మా ఫ్రెండ్స్ తో సినిమా థియేటర్లలో తెల్లవార్లు మా అభిమాన హీరో సినిమాలు చూశాను. ఫుల్ ఎంజాయ్." అని అన్నాడు. "మేమైతే రకరకాల ఆటలు అడాము." అన్నాడు సతీశ్. "నేను తెల్లవార్లూ భక్తి గీతాలు విన్నాను సర్!" అన్నాడు వేంకటేశు. "మేము శివభక్తి సినిమాలు చూశాం సర్!" అన్నది శ్రుతి. "మేము తెల్లవార్లు భక్తి పాటలు పోటీలు పెట్టుకుని పాడాము." అన్నది శివాని.
      అప్పుడు ఉపాధ్యాయుడు ఇలా మాట్లాడారు. "మహేశు, రాజేశుల కన్నా జాగరణ చేయకుండా నిద్ర పోయిన మిగతా విద్యార్థులు చాలా బెటర్. " అన్నారు. మళ్ళీ ఇలా అన్నారు. "శివుని భక్తితో రాత్రంతా గడపడం జాగరణకు అర్థం. కానీ కమర్షియల్ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయడం భక్తి ఎలా అవుతుంది?" అని. భక్తితో జాగరణ చేసిన విద్యార్థులను బాగా మెచ్చుకున్నారు.

కామెంట్‌లు