కాల్వశ్రీరాంపూర్ మండలం ఊసన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చైతన్య స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ వారు 50 లీటర్ల కెపాసిటీ గల ప్లాంటును సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యకు అందజేశారు. అనంతరం పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ మిషన్ ను అమర్చగా, దానిని శ్రీరాంపూర్ మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ ప్రారంభించారు. ప్రతిరోజు పాఠశాల పిల్లల తాగునీటి కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, అమృత సురేష్ కుమార్ రెండు క్యాన్ల మినరల్ వాటర్ ను అర కిలోమీటర్ దూరంలోని మినరల్ వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్లి తీసుకొస్తున్నారు. పాఠశాలలో పిల్లలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య దాతల ద్వారా పాఠశాలకు మినరల్ వాటర్ ప్లాంట్ ను తీసుకురావాలని నిర్ణయించారు. కొంతకాలంగా దాతల కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఊషన్నపల్లి గ్రామానికి చెందిన మంద శ్రీనాథ్ హైదరాబాదులోని సిబిఐటి కాలేజీలో సాంకేతిక విద్యనభ్యసిస్తున్నాడు. కాలేజీకి అనుబంధంగా ఉన్న చైతన్య స్పందన అనే స్వచ్ఛంద సంస్థలో అతడు సభ్యుడుగా పనిచేస్తున్నాడు. పాఠశాలలో పిల్లల త్రాగునీటి కొరత గురించి చెప్పగానే మంద శ్రీనాథ్ స్పందించారు. తమ సంస్థ ద్వారా ఊషన్నపల్లి పాఠశాలకు 50 లీటర్ల సామర్థ్యం గల మినరల్ మినరల్ వాటర్ ప్లాంట్ ను ఇప్పించుటకు సమ్మతించారు. సోమవారం ఆయన తన బృంద సభ్యులతో కలిసి పాఠశాలకు వచ్చి మినరల్ వాటర్ ప్లాంట్ మిషన్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు అమృత సురేష్ కుమార్ లకు అందజేశారు. అనంతరం ఈ మిషన్ ప్లాంట్ ను పాఠశాలలో అమర్చగా, శ్రీరాంపూర్ మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ దీనిని ప్రారంభించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతా యన్నారు. ప్రభుత్వ పాఠశాలలు గ్రామంలోని ప్రజలందరివి అని, వాటిని అభివృద్ధి చేయడానికి, పాఠశాలల్లో పిల్లల సంఖ్యను పెంచడానికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ సిరిమల్ల మహేష్ ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఉపాధ్యాయుడు అమృత సురేష్ కుమార్, సిబిఐటి చైతన్య స్పందన సంస్థ తరపున మంద శ్రీనాథ్, అనిల్, బృందం సభ్యులు, ముసుకు మధుకర్, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
ఊషన్నపల్లి పాఠశాలకు మినరల్ వాటర్ ప్లాంట్ వితరణ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి