మహాభారతంలో చిన్న నీతి కథలు అందరూ తెలుసుకొనితీరాలి. భీష్ముడు ఈకథను ధర్మ రాజుకి చెప్పాడు.అన్నివిధాల చెడిపోయిన ఓవ్యక్తి చెట్టుకింద నీరసంగా పడుకుంటాడు. ఆచెట్టుపై నాడీజంఘుడనే కొంగ అతనిపై జాలిపడి అతిథి అతిథిసత్కారం చేస్తుంది.తనమిత్రుడు విరూపాక్షుడనే రాక్షస రాజు దగ్గరకు పంపుతుంది అతను ఈవ్యక్తికి బోలెడంత బంగారం ఇచ్చాడు.వాడు దురాశాపరుడు. మళ్లీ చెట్టుకిందకి బంగారపుమూట మోసుకువచ్చాడు.నిద్రపోతున్న ఆకొంగను చంపి తిని మిగతాది మూటకట్టి బైలుదేరాడు. రాజుకి ఈవిషయం తెల్సి ఆదుష్టుడ్ని చంపమని భటులను పంపాడు.వారు ఆదుర్మార్గుడ్ని చంపి ముక్కలు చేసి కుక్కలకు వేస్తే అవి కూడా తినవు.కొంగ నాడీజంఘుని ఉన్నత గుణాలు విరూపాక్షుని మైత్రీ బంధం దుర్మార్గుని చేసిన మేలు మరిచేవారి చిత్తం తెలుస్తుంది.అందుకే కొత్త వారిని నమ్మి నెత్తికెక్కుంచుకోరాదు. స్వార్థం కృతఘ్నత చాలా ప్రమాదం.పెట్టిన చేయిని కరిచే రోజులివి.భర్తృహరి చెప్పిన శ్లోకం చదివితే మనలో ఉన్న ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్ పోతుంది.
"దరిద్రతా ధీరతయా విరాజతే
కురూపతా శీలతయా విరాజతే
కుభోజనం చోష్ణతయా విరాజతే
కువస్త్రతా శుభ్రతయా విరాజతే
దరిద్రంలో ఉన్నా ధైర్యంగా ఆత్మాభిమానంతో జీవించాలి. మనం దీనంగా హీనంగా కన్పడ్తే అందరూ తాటాకులు కట్టి చులకనగా చూస్తారు. కుచేలునిలా ఉన్నా నీతిన్యాయం తో ఉన్నవారిని ఎవరూ ఏమీ అనలేరు. నేటి యువత కి ఇదే నేర్పాలి.అప్పుచేసి పప్పుకూడు తిని ఆత్మ హత్య చేసుకోవటం నేడు రివాజైంది. కురూపి అందంగా లేనని కించపడ్తూ కుంగిపోరాదు.భౌతిక సౌందర్యం తాత్కాలికం.ఆత్మ సౌందర్యం మంచితనం పరోపకారం నిజమైన అందం!శీలం లేని అందం కాగితపు పూవు.దానికన్నా గరికపూవు మేలు కదూ?నవకాయవంటకాలతో పనిలేదు.శుభ్రత శుచిగా వేడిగా ఉండే అన్నంతో పచ్చడి కలుపుకుని తిన్నా కమ్మగా ఉంటుంది.చల్లారిన అన్నం రుచించదు.పట్టుచీర ఫ్యాషన్ వస్త్రాలు లేకున్నా ఫర్వాలేదు.శుభ్రంగా ఉతికి మడతపెట్టిన ఇస్త్రీ చేసిన దుస్తుల్లో హుందాగా కన్పడాలి.నిజంగా సర్వకాలాలకి పనికివచ్చే సుభాషితం ఇది.భరతఖండం జంబూద్వీపంలో ఉంది.కురు ప్రాంతంలో రష్యా ఉంది.ఇక్కడే కిరిస్థాన్ ఉంది. కపిలారణ్యమే నేటి కాలిఫోర్నియా.అర్జునుడు కురు భూముల్ని జయించాడు. ఆనాటి తుషార కాంభోజ దేశాలు నేటి తుర్కమెనిస్థాన్ తజికిస్తాన్.అందుకే హమారా భారత్ మహాన్🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి