చదువు సాయం : సరికొండ శ్రీనివాసరాజు

 సిరిపురం ఉన్నత పాఠశాలలో రాజేంద్ర మరియు మహేంద్ర 9వ తరగతి చదువుతున్నారు. చదువులో వారిద్దరికీ ఎప్పుడూ పోటీ. ఎవరు ఫస్ట్ వస్తారో తెలియదు. 9వ తరగతిలోకి రాగానే అమరేంద్ర అనే అబ్బాయి కొత్తగా చేరాడు.  కొత్త వాతావరణం. చదువులో అమరేంద్ర కొంచెం వెనుకబడి ఉన్నాడు. పాత స్కూల్ వాతావరణం నచ్చక సిరిపురం ఉన్నత పాఠశాలలో చేర్పించారు తల్లిదండ్రులు. రాజేంద్ర మహేంద్ర చదువులో ఫస్ట్ అని తెలుసుకున్నాడు అమరేంద్ర. రాజేంద్ర వద్ద చేరి   చేరి, "అన్నా! నేను చదువులో వెనకబడి ఉన్నాను. నీతో కలసి చదవాలని ఉంది. నాకు అర్థం కాని విషయాలు చెప్పవా ప్లీజ్!" అన్నది.  "నీ వల్ల నాకు టైం వేస్ట్ అవుతుంది. చదువులో వెనుకబడతాను. నన్ను ఒంటరిగా వదిలేయ్." అన్నాడు రాజేంద్ర.
 
     అమరేంద్ర మహేంద్ర వద్ద చేరి, తన బాధను చెప్పుకున్నాడు. మహేంద్ర తనతో పాటు కలిసి చదువుకోమని అమరేంద్రతో అంటాడు. ఇద్దరూ కలిసి చదవడం మొదలు పెట్టారు. అమరేంద్రకు అర్ధం కాని విషయాలు చెప్పడం వల్ల మహేంద్ర చదువు మరింత మెరుగు పడింది. నిరంతరం చదువు మీద ధ్యాస ఉంచడం వల్ల అమరేంద్ర చదువు శుక్ల పక్ష చంద్రునిలా పెరగసాగింది.  ఫలితంగా మహేంద్ర మొదటి ర్యాంకు రావడం,  అమరేంద్ర రెండో ర్యాంకు రావడం జరిగింది  రాజేంద్ర మూడో ర్యాంకుకు పడిపొయాడు.10వ తరగతికి వచ్చేసరికి ఇదే పునరావృతం. దిగులుతో రాజేంద్ర చదువు తగ్గుతుంది. 10వ తరగతి ప్రీ ఫైనల్స్ లో రాజేంద్ర 10వ ర్యాంకు వచ్చాడు. మహేంద్ర మరియు అమరేంద్ర సమాన మార్కులతో క్లాస్ ఫస్ట్ వచ్చారు. అందుకే అంటారు "పంచుకుంటే పెరిగేది విద్య అని."
కామెంట్‌లు