వ్యామోహం ..!!: --డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 టీవీ ..టీవీ ...అంటూ ,
మనవడు నికో....
అందరివెంట పడతాడు ,
అతడికి ఇష్టమయిన 
కార్యక్రమమే 
పెట్టమంటాడు ....!
క్షణం ఆలస్యమైతే ...
చెవులుచిల్లుపడేలా 
ఏడుపుమొదలెడతాడు 
అనుకున్నది ఏడుపుతో 
నూరుశాతం సాధిస్తాడు !
పాలుతాగడానికి తప్ప 
ఏమితినాలన్నా ....
టి.వి  తప్పకవుండాలి !
తిండిపూర్తయ్యాక 
టి.వి ..ఆపేస్తే 
అసలు ఊరుకోడు ...!
కొసమెరుపు ఏమిటంటే,
రిమోట్ ...
మనవడు నికోబాబుకిస్తే 
నవ్వుతూ....
అతడే..స్విచ్ ఆఫ్ చేసేస్తాడు!!
                   ***

కామెంట్‌లు