తెలుసుకుందాం! సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 కౌరవ పాండవుల యుద్ధం జరిగింది కురుక్షేత్రంలో .ధర్మ పరాయణుడైన కురు అనే రాజు విష్ణువు ఎదుట ధర్మ పరీక్ష లో నెగ్గాడు. హర్యానా రాష్ట్రంలో ఉంది.బ్రహ్మ సరోవరం  సన్నిహిత సరోవరం ఉన్నాయి.జోతిసర్ అనే చిన్న గ్రామంలో కృష్ణుడు గీతోపదేశం చేశాడు.నర్ కటారి అనే గ్రామంలో భీష్ముడు అంపశయ్య పై పడుకున్న గుడి ఉంది.
కన్నడంలో ప్రసిద్ధ కవయిత్రి అక్కమహాదేవి 12వశతాబ్దికి చెందిన శివ భక్తురాలు.ఉడుతడిలో జన్మించిన ఈమె తల్లితండ్రులు సుమతి నిర్మల శెట్టి.వీరశైవులు కావడంతో బాల్యంలోనే అక్కమహాదేవి శివునే ఆరాధించి శివ శరణవచనాలు స్వరవచనాలు రచించి శ్రీశైలం లో తపస్సు చేసింది.అక్కమహాదేవి గుహలుగా ప్రసిద్ధి కెక్కాయి.అక్కడ‌ కదళీవనంలోనే సిద్ధి పొందింది.కర్ణాటక వీర శైవులు ఆమె ను దేవతగా కొలుస్తారు.మనభారతదేశం జంబూ ద్వీపం లో ఉంది.కపిలారణ్యమే యు.ఎస్.లోని కాలిఫోర్నియా.రష్యా ఆనాటి కురు వర్షంలో ఉంది.ఆనాటి తుషార కాంభోజ దేశాలే నేటి తుర్క్మెనిస్తాన్ తజికిస్తాన్.గాంధారి ఆఫ్గనిస్తాన్ కి చెందింది.
కృపాచార్యుడు కృపి అన్నాచెల్లెళ్లు.వీరి తండ్రి శరధన్వుడు.కృపాచార్యుడు ద్రోణాచార్యుడు హస్తినాపురం లో ఉండి పోయారు.మహాభారతంలో ప్రసిద్ధి చెందిన గురువులు వారు🌹
కామెంట్‌లు