ఆటల్లో ..ఆరింద ...!!--డా.కె.ఎల్.వి.ప్రసాద్

 బండినడపడం అంటే 
భలే హుషారు ....
ఆటల్లో అది ఉంటే 
చెలరేగిపోతాడు 
మామనవడు నికో * !
బండిని ---
నెమ్మదిగానడపడం 
అసలు ఇష్టపడడు 
స్పీడుగానడుపుతూ 
సడెన్గా 'కట్' లు 
కొడుతుంటాడు ....!
బండిపడిపోకుండా 
బ్యాలెన్సు -
నిలదొక్కుకుంటాడు ,
చూసేవారికి -
భయముకలిగిస్తాడు !
చిన్నక్కతో పాటు 
చక్కగా ఆడుకుంటాడు ,
ఆటలుంటేచాలు -
అన్నీ మర్చిపోతాడు ...
మనవడు ..నికోబాబు !!
                ***
కామెంట్‌లు