డా. హారిక నాంపల్లి, కరీంనగర్
రాను రాను కృత్రిమంగా తయారవుతున్న ఈ ప్రపంచం, అవయవాలను మాత్రం కృత్రిమంగా తయారుచేయలేకపోతుంది. (బహుషా ఎప్పటికీ తయారు చేయలేకపోవచ్చునేమో!)
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అనేది ఎప్పటి నుండో మనం వింటూ వస్తున్న నానుడి.
కానీ ప్రస్తుతం మన సమాజంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న అత్యంత భయానక అనారోగ్య పరిస్థితులు, వాటి కారణంగా కొన్ని సందర్భాల్లో అవయవాలు విఫలమై మృత్యువు అంచులకి చేరడం, అవయవ మార్పిడి (Organ Transplantation) ల ద్వారా తిరిగి పునర్జన్మ పొందడం - తద్వారా కొన్ని సంవత్సరాల పాటు వారి జీవిత కాలాన్ని పొడిగించే అవకాశం ఉండటం వంటివి గమనిస్తూ ఉంటే....
"అన్ని దానాల్లో కెల్లా అవయవదానం మిన్న" అని అర్థమవుతుంది. ప్రపంచం చాలా రంగాల్లో కొత్త పుంతలు తొక్కుతూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నప్పటికినీ..... అవయవదానంపై మతపరంగా ఉన్న అపోహలు, భయాలు, మూఢనమ్మకాలు మరియు అవయవ దానంపై సరియైన అవగాహన (Awareness) & మార్గదర్శకత్వం (Guidance) లేకపోవడం వంటి కారణాల వల్ల అవయవదాతల కొరత ఇప్పటికీ ఉంది. ఎంతోమంది అభాగ్యుల ఆకలి, వారి ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని, వారికి డబ్బు ఆశ చూపి, వారి అవయవాలను అమ్ముకుంటూ-అక్రమాలకు పాల్పడుతున్నటువంటి సంఘటనలు కూడా అవయవదానంపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారి పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రపంచంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు , ఆయా అనారోగ్య కారణాల వల్ల బ్రెయిన్ డెడ్ అవడం(జీవన్మృతులు) లేదా మరణం సంభవించడం; సహజ మరణం పొందడం వంటి కారణాలతో కొన్ని వేలాది మంది చనిపోతున్నారు. కానీ కారణం ఏదయినప్పటికినీ, వారి అవయవాలు దానం చేయడానికి ముందుకు వచ్చే వారి కుటుంబ సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.

అవయవ దానం ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడానికి ప్రతి సంవత్సరం ఆగష్టు 13 న "ప్రపంచ/అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం" గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రభుత్వాలు,ఎన్నో ఆసుపత్రులు - మరెంతో మంది డాక్టర్లు,అనేక స్వచ్ఛంద సంస్థలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, దీని యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తాయి.
అయినప్పటికినీ ఇతర దేశాలతో పోలిస్తే, మన దేశంలో చాలా తక్కువ మంది అవయవ దానం చేయడానికి ముందుకు వస్తున్నారు.
అయినప్పటికినీ ఇతర దేశాలతో పోలిస్తే, మన దేశంలో చాలా తక్కువ మంది అవయవ దానం చేయడానికి ముందుకు వస్తున్నారు.
అవయవాలు అవసరం ఉన్న వారి సంఖ్య వేలల్లో ఉంటే, దాతల సంఖ్య వందల్లో ఉంది.
అవయవ దాతల సంఖ్య తక్కువగా ఉండి, ఆ కారణంగా అవయవాల కొరత ఏర్పడటం ; అవయవాల కోసం ఎన్నో రోజులుగా వేచి చూస్తూ - శారీరక,మానసిక,ఆర్థిక,సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, అవయవ మార్పిడి చేస్తే పునర్జన్మ పొందే అవకాశం ఉన్నా - సరియైన సమయంలో అవయవ మార్పిడి జరగక, ఎంతో మంది విగతజీవులుగా మారడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అనే సమాచారం విస్తృతం చేసినపుడే ప్రజల్లో చైతన్యం వచ్చి అవయవదానంకై ముందుకు వస్తారు. అందువల్ల చట్టబద్ధమైన ఈ అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు, తెలంగాణ ప్రభుత్వం 2013లో 'జీవన్ దాన్' అనే ప్రత్యేక సంస్థను స్థాపించింది.

ఈ సంస్థ బ్రెయిన్ డెడ్ అయిన వారి వివరాలు సేకరించి, వారి కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించి,వారి అనుమతితో, దాతల శరీరాల నుండి అవసరమైన అవయవాలను సేకరించి, అన్ని వైద్య పరీక్షలు & ప్రభుత్వ అనుమతుల అనంతరం, ప్రాధాన్యతా క్రమం ఆధారంగా అత్యవసరంలో వున్న రోగులకు వాటిని అమర్చడం వంటి కార్యక్రమాల ద్వారా వారికి పునర్జన్మను ప్రసాదిస్తుంది.
నిమ్స్ ఆసుపత్రి, హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ గా , మరికొన్ని ఇతర ఆసుపత్రులు జీవనదాన్ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.
కానీ అవయవదానంపై ప్రచారం కల్పించడంలో ఈ సంస్థ సరియైన చర్యలు తీసుకోకపోవడం వల్ల రాష్ట్రంలో అవయవ దాతల సంఖ్య పెరగడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి.
భారతదేశంలో 18 ఏండ్లు దాటిన వారు స్వచ్ఛందంగా & 18 ఏండ్ల లోపు వారు తల్లిదండ్రుల అనుమతితో.... జాతీయస్థాయిలో నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO); రాష్ట్రస్థాయిలో జీవన్ దాన్ వంటి సంస్థల్లో తమ బ్రెయిన్ డెడ్ అనంతరం అవయవదానం చేయాలనుకునే వారు & అవయవాలు అవసరం ఉన్న వారు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆన్ లైన్లో వివరాల నమోదు అనంతరం, వారికి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అవయవదాతలు గా రిజిస్ట్రేషన్ ఐడి నంబరుతో ఆర్గాన్ డోనార్ గుర్తింపు కార్డు వస్తుంది.
గుర్తింపు కార్డు పొందిన తర్వాత, సదరు వ్యక్తి తన కుటుంబ సభ్యులకు ఈ నమోదు చేసుకున్న విషయం తెలియజేయాలి.

జీవన్ దాన్ వెబ్ సైట్ (Govt. of Telangana) లో - ఈ సంస్థలో రిజిస్టర్ అయిన అవయవదాతలు, అవయవాలు విఫలపై - అవయవ మార్పిడి కోసం వేచి చూస్తున్న రోగులు, అవయవ మార్పిడి చేపట్టే ఆసుపత్రులు, ఇప్పటి వరకు జరిగిన వేర్వేరు అవయవ మార్పిడుల వివరాలు; వీటన్నింటికీ సంబంధించిన ప్రభుత్వ ఆమోదిత చట్టాలు; అవయవ దానం కోసం సంస్థ వారు చేసే అవగాహనా కార్యక్రమాలు వంటి మరెన్నో వివరాలు అందుబాటులో ఉంటాయి.
అవయవ దానం అనేది 2 రకాలు.
అవయవ దానం అనేది 2 రకాలు.
(ఎటువంటి అవయవదానంలో అయినా అవయవ దాతలు ఆరోగ్యకరంగా ఉండాలి.)
1. సజీవ అవయవ దానం
2. బ్రెయిన్ డెడ్ తర్వాత చేసే అవయవ దానం.
2. బ్రెయిన్ డెడ్ తర్వాత చేసే అవయవ దానం.
1.సజీవ అవయవ దానం : (దాత - బ్రతికుండగా చేసేది)
స్వంత కుటుంబ సభ్యుల ప్రాణరక్షణకు అవయవదానం కనుక తప్పనిసరి అయితే, ఆ కుటుంబంలోని వారు -వారికి అవయవదానం చేయాలనుకుంటే, డాక్టర్ల సూచన మేరకు, తమ శరీరంలో ఎలాంటి అసమతుల్యత & ఆరోగ్యానికి హాని జరగదని నిర్ధారణ అయిన తర్వాత , గ్రహీతకు ఆ కుటుంబ సభ్యుల అవయవం అన్ని రకాలుగా మ్యాచ్ అవుతుంది అనుకుంటే, ఎలాంటి సందేహం లేకుండా... తాము బ్రతికుండగానే అవసరాన్ని బట్టి ఒక కిడ్నీ , కాలేయంలో కొంతభాగం దానం చేయవచ్చు.

అయితే బ్రతికుండగానే తమ అవయవదానం చేసిన వారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ ఉంటే తర్వాత ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఏర్పడవు.
జన్యుపరమైన కిడ్నీ సమస్యలతో జన్మించిన పిల్లలు & ఏ కారణం చేతనైనా కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్న వారు(కిడ్నీ ఫెయిల్యూర్) డయాలసిస్ మీద ఆధారపడుతూ, జీవించినంత కాలం ఆ డయాలసిస్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ బ్రతుకు భారంగా వెళ్లదీస్తున్నారు.ఇలాంటి వారికి కిడ్నీ మార్పిడి ద్వారా మంచి జీవితాన్ని అందించవచ్చు.
సజీవదాతలు వారి వారి కుటుంబ సభ్యుల కొరకైనా ముందుకు వస్తే, ఇతరుల మరణానంతరం జరిగే అవయవ మార్పిడి కన్నా, ఇది వేరే వారి అవయవాల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించి, ఎక్కువ మంది ప్రాణాలను కాపాడుతుంది.
2.బ్రెయిన్ డెడ్ తర్వాత చేసే అవయవ దానం :
బ్రెయిన్ డెత్ (జీవస్మృతి) - అంటే వైద్య పరిభాషలో మెదడు తన పనితీరును పూర్తిగా కోల్పోవడం (మరణించడం) అని అర్థం. ఇది శరీరం బ్రతికి అండి, మెదడు పూర్తిగా మరణించిన స్ధితి.
రోడ్డు & ఏవైనా ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలవడం, ఆయా అనారోగ్య సమస్యలు(నివారణ కాని వ్యాధులు - ఇందులో ఒకటి లేదా కొన్ని అవయవాలు జబ్బుతో బాధపడుతూ,మిగతా అవయవాలు ఆరోగ్యంగా ఉండి) తీవ్రమై మెదడుని పూర్తిగా దెబ్బతీయడం వంటి వాటి వల్ల బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది. ఇలాంటి స్థితిలో శరీరంలోని కీలక అవయవాలు - ప్రత్యేక చికిత్సలు,కృత్రిమ శ్వాస (వెంటిలేటర్) & రక్త సరఫరాతో పనిచేస్తుంటాయి.

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి, దాని నుండి బయటపడే అవకాశాలు దాదాపు ఉండవు. కృత్రిమ శ్వాస (వెంటిలేటర్) ను తొలగించగానే బాధితుడు మరణిస్తాడు. చాలా మంది డాక్టర్ల బృందం కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు చేసి, ఆ వ్యక్తి బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించి, వారి కుటుంబ సభ్యులకు ఈ స్థితి గురించి పూర్తిగా వివరిస్తారు. ఒకవేళ ఆవ్యక్తి కుటుంబ సభ్యులు అవయవ దానంకై స్వతహాగా ముందుకు వచ్చినా (లేదా) సదరు వ్యక్తి బ్రతికుండగానే అవయవ దానంకై రిజిస్టర్ చేయించుకున్న సమాచారం కుటుంబ సభ్యులు... డాక్టర్లకు తెలియజేసినా, ఆ వ్యక్తిని వెంటిలేటర్ నుంచి బయటకి తీసుకువచ్చే లోపు అతనిలో జీవం ఉండగానే అవయవాలు సేకరిస్తారు.
బ్రెయిన్ డెడ్ అయిన పరిస్థితిలో వయస్సుతో సంబంధం లేకుండా అందరూ అవయవ దానం చేయవచ్చు. గుండె, మూత్రపిండాలు, కాలేయం, క్లోమం, ఊపిరితిత్తులు, కళ్ళు, ఎముక మజ్జ,
బ్రెయిన్ డెడ్ అయిన పరిస్థితిలో వయస్సుతో సంబంధం లేకుండా అందరూ అవయవ దానం చేయవచ్చు. గుండె, మూత్రపిండాలు, కాలేయం, క్లోమం, ఊపిరితిత్తులు, కళ్ళు, ఎముక మజ్జ,
చర్మం, ప్రేగులు, కణాలు- కణజాలాలు వంటి అవయవాలను దానం చేయవచ్చు.
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి సేకరించిన అవయవాలతో, అవయవ దానం చేయడం ద్వారా సగటున 8 మందికి పునర్జన్మను ఇవ్వగలిగే అవకాశం వుంది.
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి సేకరించిన అవయవాలతో, అవయవ దానం చేయడం ద్వారా సగటున 8 మందికి పునర్జన్మను ఇవ్వగలిగే అవకాశం వుంది.
బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత చేసే అవయవదానంలో, కేవలం ఛాతీ క్రింద ఒక చిన్న కోత పెట్టి, అవసరమైన అవయవాలు సేకరిస్తారు. శరీరంపై మరింకెక్కడా ఎలాంటి కోతలు ఉండవు. తర్వాత వారి కుటుంబ సభ్యులకు ధ్రువీకరణ పత్రం అందచేసి, అంతిమ సంస్కారాలకు ఎలాంటి ఆటంకం లేకుండా భౌతిక కాయాన్ని యధావిధిగా అప్పగిస్తారు.
దాతల నుండి అవయవాలు సేకరించిన సమయం నుండి- గ్రహీతల్లో ఆ అవయవాల మార్పిడి చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది.
అది ఒక్కో అవయవానికి ఒక్కోలా ఉంటుంది.
అది ఒక్కో అవయవానికి ఒక్కోలా ఉంటుంది.
గుండె (4-6 గంటల లోపు),
ఊపిరితిత్తులు (4-6 గంటల లోపు),
ప్రేగులు (4-6 గంటల లోపు),
ఊపిరితిత్తులు (4-6 గంటల లోపు),
ప్రేగులు (4-6 గంటల లోపు),
కాలేయం (12-16 గంటల లోపు),
కిడ్నీ (24-48 గంటల లోపు),
కార్నియా (48 గంటల లోపు),
కిడ్నీ (24-48 గంటల లోపు),
కార్నియా (48 గంటల లోపు),
కణజాలాలు (వీటిని ఎక్కువ రోజులు పాడవకుండా భద్రపరిచే అవకాశం ఉంది).
దాతల నుండి గ్రహీతలకు కావాల్సిన అవయవాలను అమర్చడానికి కొన్ని సందర్భాల్లో ఆ నిర్ధిష్టమైన సమయం సరిపోదు.
ఉదాహరణకి :
దాతల నుండి గ్రహీతలకు కావాల్సిన అవయవాలను అమర్చడానికి కొన్ని సందర్భాల్లో ఆ నిర్ధిష్టమైన సమయం సరిపోదు.
ఉదాహరణకి :
1.దాత , అవయవ మార్పిడికై వేచి చూస్తున్న వ్యక్తి (రోగి) వేరు వేరు ప్రదేశాల్లో ఉండటం .
2.అవయవ సేకరణ మార్పిడుల ప్రక్రియ చేసేందుకు కావాల్సిన సౌకర్యాలు అన్ని ఆసుపత్రుల్లో లేకపోవడం. అలాంటి సందర్భాల్లో నిర్దిష్ట గడువులోగా ముగియాల్సిన, అత్యంత విలువైన ఈ అవయవ సేకరణ & మార్పిడుల ప్రక్రియ కోసం ప్రత్యేక డాక్టర్ల బృందం & జీవన్ దాన్ సంస్థ కో ఆర్డినేటర్లు - పోలీసు శాఖ వారి సహకారంతో రోడ్ ట్రాఫిక్ వల్ల ఎలాంటి ఆలస్యం జరగకుండా, అవయవ సేకరణ జరిగే మరియు అవయవ మార్పిడి జరగబోయే ప్రదేశాల్లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించుకొని, ఈ కార్యక్రమంలో ఎలాంటి జాష్యం జరగకుండా జాగ్రత్తపడతారు.

రోడ్డు రవాణా వల్ల ఈ మొత్తం ప్రక్రియ ఆలస్యం అవుతుంది అనుకుంటే, ఎయిర్ పోర్టుకి చేరుకుని - విమానయానం ద్వారా త్వరితగతిన అవయవాలను తరలిస్తారు (Organ Transportation).
సేకరించిన అవయవాలను బాక్సుల్లో భద్రపరచి, ఆ బాక్సులతో డాక్టర్లు హుటాహుటిన పరుగెత్తటం వంటి ఆసుపత్రుల్లో జరిగే దృశ్యాలు వార్తల్లో మనం చూస్తూనే వుంటాము.
కావున అవయవ సేకరణ నుండి అవయవ మార్పిడి వరకు గల క్లిష్టతరమైన ప్రక్రియలో పాల్గొంటున్న డాక్టర్లు- ఆసుపత్రి యాజమాన్యాలు; జీవన్ దాన్ సంస్థ యాజమాన్యం & ప్రతినిధులు; దాత & దాతల కుటుంబ సభ్యులు మరియు అవయవ దానంపై అవగాహన పెంపొందించడాని మారథాన్ లు, స్పెషల్ డ్రైవ్ లు, విద్యా & ఇతర సంస్థలను సందర్శించడం వంటి వివిధ కార్యక్రమాల ద్వారా ప్రచారం చేస్తున్న సామాజిక సేవ్రా కార్యకర్తలు,స్వచ్ఛంద సంస్థలు, మీడియా సంస్థలు....వీరందరూ అభినందనీయులే.

* నేత్రదానం గురించి:
ఈ రెండు రకాల అవయవ దానాలతో పాటు, సహజ మరణం పొందిన తర్వాత కూడా నేత్రదానం చేయవచ్చు. కావున సహజ మరణం పొందిన వ్యక్తి కుటుంబ సభ్యులు, ఒకవేళ ఆ వ్యక్తి కళ్ళను దానం చేయాలనుకుంటే, ఆలస్యం చేయకుండా వెంటనే నేత్రనిధి (ఐ బ్యాంక్) వారికి సమాచారం అందించాలి. అప్పుడే చనిపోయిన వ్యక్తి ఏ కారణంతో చనిపోయారు; ఆ వ్యక్తి బ్రతికుండగా కలిగిన జబ్బులు వంటి పూర్తి వివరాలు నేత్రనిధి ప్రతినిధులకు తెలియజేయాలి.
వారు వచ్చి నేత్రాలను సేకరించేలోపు, ఆ వ్యక్తి నేత్రాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తారు.(చనిపోయిన వ్యక్తి కళ్ళపై ఆంటీ బయోటిక్ డ్రాప్స్/ సెలైన్ వంటివి వేసి, కనురెప్పలను మూసివేయడం వంటివి - దీనివల్ల కంటి లోపల పొడిబారకుండా, తద్వారా కార్నియాలు పాడవకుండా ఉంటాయి).

బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులు; కళ్లద్దాలు వాడేవారు, ఇదివరకు కాటరాక్ట్ వంటి కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారు కూడా ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరూ(1 సంవత్సరం నుండి
ఎంత వయసు వారయినా) నేత్ర దానం చేయవచ్చు.
నేత్రదానం చేశాక, చనిపోయిన వ్యక్తి ముఖం భయానకంగా ఉంటుందేమోననే భయంతో చాలామంది నేత్రదానానికి వెనకడుగు వేస్తారు. కానీ కార్నియాల సేకరణ అనేది కంటి ఆకృతి లో ఎలాంటి మార్పు కలగకుండా చేసే ఒక తేలికపాటి ప్రక్రియ.కావున ఎలాంటి భయం లేకుండా నేత్ర దానాన్ని చేయవచ్చు. కంటిచూపు లేకపోతే మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది.
కావున ఒక చనిపోయిన వ్యక్తి నేత్రదానం వల్ల మరో ఇద్దరు కంటిచూపు లేని వ్యక్తుల (పుట్టుకతో చూపులేనివారు, ఏదేని కారణాల వల్ల చూపు కోల్పోయిన వారు) జీవితాల్లో వెలుగు నింపవచ్చు.
నేత్రదానం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి, చైతన్యవంతులుగా చేయడానికి ప్రతి సంవత్సరం 25,ఆగష్టు - 8,సెప్టెంబరు వరకు నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తారు.

ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ 1990 ల్లోనే తన అందమైన నీలి కళ్ళను - ఒక ఫౌండేషన్ కు తన మరణానంతరం దానం చేస్తాననిప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ ప్రకటన చాలా మందిని ప్రభావితం చేసి, మన దేశంలో నేత్ర దానాల సంఖ్యను పెంచడంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఆవిడ ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి దేశవ్యాప్త నేత్రదాన ప్రచార కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు.

* వివిధ ఆసుపత్రులు & స్వచ్ఛంద సంస్థలు అవయవదానంపై నిర్వహించిన
అవగాహన సదస్సుల్లో పాల్గొని; దాని ప్రాముఖ్యతను గుర్తించి - ఈ బృహత్కార్యంలో
వారు కూడా భాగస్వామ్యులై, తమ మరణానంతరం అవయవ దానం చేస్తామని ప్రకటించిన కొందరు ప్రముఖల వివరాలు:
అవగాహన సదస్సుల్లో పాల్గొని; దాని ప్రాముఖ్యతను గుర్తించి - ఈ బృహత్కార్యంలో
వారు కూడా భాగస్వామ్యులై, తమ మరణానంతరం అవయవ దానం చేస్తామని ప్రకటించిన కొందరు ప్రముఖల వివరాలు:
సీని ప్రముఖులు - విజయదేవరకొండ, జగపతిబాబు, విశ్వక్ సేన్, నవదీప్, ప్రియాంక చోప్రా, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ తో పాటు మరెందరో ఇతర నటీ నటులు. ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త షబానా అజ్మీ మరియు ప్రముఖ కవి, రచయిత జావేద్ అఖ్తర్ దంపతులు అవయవ దానంపై ముందుకు రావడమే కాకుండా, కొన్ని సంవత్సరాలుగా అవయవదానంపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
హీరో జగపతి బాబు గారు అవయవదానం చేస్తానని ప్రకటించాక; వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులు అందరూ కలిపి దాదాపు 100 మంది వరకు ముందుకు వచ్చి, తాము కూడా అవయవదానం చేస్తామని, ప్రమాణ పత్రాల్లో సంతకాలు చేసారు.
ప్రముఖ క్రికెటర్లు - కపిల్ దేవ్, గౌతమ్ గంభీర్ ప్రముఖ తెలంగాణ పోలీస్ ఆఫీసర్ - వీసీ సజ్జనార్ వివిధ రంగాల్లో గల అనేక మంది ప్రముఖులు అవయవ దానంకై ముందుకు వచ్చారు.
ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ భారతదేశంలోని మ్యారో డోనార్ రిజస్ట్రీ ఇండియా(MDRI) లో తన పేరును నమోదు చేసుకున్నారు.

తర్వాత ఒకానొక సందర్భంలో - బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న 14 ఏళ్ళ బాలిక పూజ ఎముక మజ్జ (బోన్ మ్యారో) మార్పిడి చికిత్స కోసం దాతలు ఎవరూ ముందుకు రావడం లేదని ఆ బాలిక తల్లి, సల్మాన్ ఖాన్ గారికి విజ్ఞప్తి చేసుకుంటే, తన బోన్ మ్యారో సరిపోలితే దానం చేస్తానని హామీ ఇచ్చాడు. తన టీం సభ్యులు కూడా ఎవరూ ఈ దానానికి ముందుకు రాకపోవడంతో, తర్వాత తనే స్వయంగా ముందుకు వచ్చి, తన ఎముక మజ్జ దానం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. దీనితో సల్మాన్ ఖాన్ భారతదేశపు మొట్టమొదటి ఎముక మజ్జ దాత (India's First Bone marrow Donor) అయ్యాడు.
* అవయవ మార్పిడి ద్వారా తిరిగి పునర్జన్మ పొందిన కొందరు ప్రముఖుల వివరాలు:
ప్రముఖ కవి, రచయిత సుద్దాల. ఆశోక్ తేజ గారు తీవ్రమైన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సందర్భంలో - వారి కుమారుడు, తన కాలేయంలోని కొంత
భాగం దానం చేయడం వల్ల, పూర్తిగా కోలుకొని, మునుపటి లాగే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.

* ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ - సెలెనా గోమెజ్ కు, శరీరంలోని ముఖ్య అవయవాలను దెబ్బతీసే 'లూపస్' అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి వల్ల, తన రెండు కిడ్నీలు దెబ్బతినడంతో, కిడ్నీ మార్పిడి తప్పనిసరి అయింది. తన స్నేహితురాలు కిడ్నీ దానం చేయడంతో, తిరిగి కోలుకుని, మరలా తన ఆల్బమ్స్ తో ప్రపంచాన్ని అలరిస్తుంది.
* స్టీవ్ జాబ్స్ (మాజీ సీఇవో, ఆపిల్ కంపెనీ) - తాను బ్రతికి వున్నప్పుడు కాలేయ మార్పిడి చేయించుకోవడం జరిగింది.
ఇలా అవయవ మార్పిడిల ద్వారా తిరిగి పునర్జన్మను పొందిన వారెంతో మంది ఉన్నారు.
* భారత ప్రభుత్వం ప్రజల్లో అవయవదానంపై మతపరంగా వున్న అపోహలు పోగొట్టి, పెద్ద సంఖ్యలో అవయవ దానాల సంఖ్య పెంపొందించడానికి
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్, ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మరెందరో ఇతర మతాల(ముస్లిం,క్రిస్టియన్,సిక్కు)
గురువులు/పెద్దలతో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్, ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మరెందరో ఇతర మతాల(ముస్లిం,క్రిస్టియన్,సిక్కు)
గురువులు/పెద్దలతో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.
* మహా సహస్రావధాని, ప్రముఖ ప్రవచన కర్త శ్రీ.గరికిపాటినరసింహారావు గారు - పౌరాణికాల్లో గల గజాసురుడు, శిబిచక్రవర్తి, దదీచి మహర్షుల గాధల ద్వారా అవయవదానం మన సనాతన ధర్మంలో ఎప్పటి నుండో ఉందని, ఇది హిందూ ధర్మానికి విరుద్ధం కాదని ఎన్నో టి.వి. ఛానళ్ళు, వేదికలపై తన అద్భుతమైన ప్రసంగాలతో ప్రజలలో అవయవ దానం పై గల అంధ విశ్వాసాలు & మూఢ నమ్మకాలను పారద్రోలే ప్రయత్నానికి పూనుకున్నారు.బ్రతికి ఉన్నపుడు మరిణించాక కూడా ఇతరులకు సహాయంపడటం అనేదే నిజమైన భక్తి అని పేర్కొన్నారు.
* నేను వైద్యరంగంలో ఉండటం వల్ల - అవయవ దానంపై కొంత అవగాహన ఉండి, దాదాపు 4 సంవత్సరాల క్రితం జీవన్ దాన్ సంస్థలో అవయవ దాతగా నా పేరును రిజిష్టరు చేయించుకున్నాను. నా మరణానంతరం,జీవన్ దాన్ ట్రస్టుకు - అందులో రిజిష్టరు చేయించబడిన నా అవయవాలను అప్పగించాలని నా కుటుంబ సభ్యులకు ముందే మనవి చేసుకున్నాను. నా ప్రతి సామాజిక,సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ వారి సహాయ,సహకారాలు అందించే నా తల్లితండ్రులు, ఈ విషయమై - చిన్న వయసులో ఇలాంటి నిర్ణయం ఎందుకని తొలుత తిరస్కరించినప్పటికీ, తర్వాత అయిష్టంగానే ఒప్పుకోవలసి వచ్చింది.
తర్వాత మా అన్నయ్య నా కోరికను మన్నించి, ఎలాంటి అభ్యంతరం లేకుండా తన సహకారం (As a Witness) అందించడంతో ఆ పని పూర్తి చేయగలిగాను.
ఆ సహకారానికి గానూ మా అన్నయ్యకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇలా ఎంతో మంది పెద్ద మనసుతో ముందుకొచ్చి తమ మరియు తమ కుటుంబ సభ్యుల అవయవాలను దానం చేసి, అవయవ మార్పిడి కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభాగ్యులను ఆదుకుని, వారి కుటుంబాలను నిలబెట్టిన వారవుతున్నారు.
కుటుంబ సభ్యులు, మిత్రులు, ఇతరులకు - ఎవరికైనా సరే దీని ప్రాముఖ్యతను వివరించి; అవయవ దాతలుగా ముందుకు రావడానికి అవగాహన కల్పించి, మార్గదర్శనం చేయడం వరకు మన వంతు కృషి చేయడం మాత్రమే మన బాధ్యత.
కానీ వారి ఇష్టా - అయిష్టాలు, అభిప్రాయాలని గౌరవించి; వారి యొక్క నిర్ణయాన్ని వారికే వదిలి వేయాలి తప్ప - వారిని ఒత్తిడికి గురిచేసి, వారి నిర్ణయాన్ని ధిక్కరించే హక్కు ఎవరికీ లేదు.
ఒక సదుద్దేశ్యంతో అందరికీ అవయవ దానంపై అవగాహన తీసుకురావాలనే నా ఈ చిన్ని ప్రయత్నాన్ని అర్థం చేసుకొని, దీన్ని మనందరి సామాజిక బాధ్యత గా భావించి, మీ వంతు పాత్ర పోషిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి