ఎలిఫెంట్ ఆ గుహల్లో రకరకాల అపూర్వ శిలా విగ్రహాలు ఉన్నాయి 1500 ఏళ్ల క్రితం చాళుక్యులు రాష్ట్రకూటులక కాలంలో ఇవి చెక్కబడినాయి. ఇందులో ఒక అపూర్వమైనటువంటి శిల్పం అది చాలా బాగుంటుంది ఏంటంటే అది అంధకాసురుని వధించే శివుని విగ్రహం. అందకాసురుడు ఈ రాక్షసుడు శివుని పుత్రునిగా పురాణాల్లో వర్ణించబడింది ఒకసారి పార్వతీదేవి శివుని రెండు కళ్ళని తన చేతులతో మూసేస్తుంది అప్పుడు లోకమంతా చీకటి అయిపోతుంది శివుడు తన మూడో నేత్రాన్ని తెరుస్తాడు ఆ వేడికి ఆమె చేతులు చెమటలు పడతాయి ఆ చెమట లోంచి ఒక శిశువు పుడతాడు చీకటిలో పుట్టిన వాడు కాబట్టి వాడికి అంధకుడు అని పేరు పెడతారు వాడిని ఒక రాక్షస భక్తుడికి శివుడు పెంపకానికి ఇచ్చేస్తాడు వీడు అమరత్వం కోసం బాగా తపస్సు చేసి బ్రహ్మ ని వరం అడుగుతాడు నేను దేవతల వల్ల ఎలాంటి బాధపడకుండా నాదే జయం కావాలి ఒక షర తు ప్రకారం వాడు తల్లి చేతిలోనే చస్తాడు ఆమెని వంకర చూపు చూస్తే వాడి చావు తప్పదు వాడి చావు తప్పదు రాక్షసతి కొడుకుగా బలార్చుడిగా తయారయ్యి మూడు లోకాన్ని సతాయిస్తూ ఉంటాడు ఆఖరికి కైలాస పర్వతంపై దండెత్తుతాడు అక్కడ తల్లి పార్వతిని చూసి కుబుద్ధితో వంకర చూపులు చూస్తాడు శివుడు తన త్రిశూలంతో వాడిని చంపేస్తాడు వాడి ఒక్కొక్క రక్త బిందువు నుంచి ఇంకో కొత్త రూపాలు వస్తాయి అందుకని వాడి రక్తం కిందకి జారకుండా త్రిశూలాన్ని ఎత్తిపడతాడు కాళికా అమ్మ అవతారం ఎత్తి పార్వతి వాడి శరీరం నుంచి కారే ప్రతి రక్తపు చుక్కను ఆమె తాగేస్తుంది నోట్లో గుటకేసి మింగుతుంది తాంత్రిక గ్రంథాల ప్రకారం శిశువుకి తల్లి నుంచి రక్తం తండ్రి నుంచి ఎముకలు లభిస్తాయి ఇక్కడ మధాంధుడైన అందకాసురుడు తన తల్లిని మోహించాడు కాబట్టి కేవలం వాడు ఎముకల పోగుల మిగిలాడు శివుని స్తుతించి ఆయన మెప్పు పొంది బృంగి అనే రిషిగా మారాడు అందుకే కంకాల రూపంలో బృంగి ఉంటాడు ఇది శివుని శక్తికి ఒక ఆధారం మనిషి మాయ మోహంలో ఎవర్ని కూడా ముఖ్యంగా స్త్రీలని వంకర చూపు చూడకూడదు ప్రస్తుతం ఇలాంటి కామ పిశాచుల వలననే పసిపాపలపై బడి పిల్లలపై స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి ఎలిఫెంట్ ఆ గుహల్లో ఇలాంటి అపురూప శిల్పాలు ఉన్నాయి అజంతా గుహలు కూడా చాలా ప్రసిద్ధికి చెందాయివెనక్కి తిరిగి చూడొద్దు. ఎప్పుడు ముందు చూపే ఉండాలి సదా మంచి బా టపై నడవాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు.రకరకాల కథలు కథనాలు వివిధ దేశాల్లో ప్రచారంలో ఉన్నాయి.ఒడిషా సాక్షీగోపాలుని కథ ఇదే.తన కూతుర్ని ఒకయువకునికిచ్చి పెళ్లి చేస్తానన్న పెద్ద మనిషి మాట తప్పాడు. "నీవు భగవంతుడైన శ్రీకృష్ణ ఆలయం దగ్గర నాకు మాట ఇచ్చావుకదా? ఎందుకు నీకూతుర్నిచ్చి పెళ్లి చేయవు?" అని నిలదీస్తాడు. "సరే ఆకృష్ణుడినే సాక్షిగా పిల్చుకొని రా!" అంటాడు ఆవృద్ధుడు. ఆయువకుని అమాయకత్వంకి సంతోషించిన దేవుడు"నీవు వెనక్కి చూడకుండా నడు." అంటాడు.కాలి గజ్జెల చప్పుడు వెనుక వినపడకపోటంతో అతను తిరిగి చూడటం కృష్ణుడు శిలావిగ్రహంలా అక్కడ నిల్చిపోటం తో సాక్షీ గోపాలమందిరం వెలిసింది.
గుజరాత్ లో ఆశాపురామాత ఆలయం కూడా ఇలా వెలిసిందే అని కథ చెప్తారు.ఒకవ్యాపారి కి అమ్మ వారు అభయం ఇస్తుంది" నేను సదా నీవెంట ఉంటాను. నీవు వెనక్కి తిరిగి చూడొద్దు." రాజస్థాన్ గుజరాత్ లలో ఆశాపురా మాత వారి కులదేవత.ఛత్తీస్ గఢ్ లో దంతేశ్వరీ మాత ఆలయం వెనుక ఉన్న కథ కూడా ఇదే!"రాజా!నేను నీవెనకే వస్తుంటాను. తిరిగి చూడకు" అన్న దేవత కాలిగజ్జెల చప్పుడు విన్పడకపోటంతో రాజు వెనక్కి తిరిగి చూడగానే ఆమె శిలగా మారింది.
గ్రీక్ కథలో ఆర్ఫియస్ గొప్ప సంగీత కళాకారుడు.రాళ్లు కరిగేవి అతని గానానికి భార్య యురిడీస్ పాముకాటుతో మరణిస్తుంది. అతను మృత్యులోకానికెళ్లి తన గానంతో మృత్యుదేవతను మెప్పిస్తాడు."నీవు భూలోకంచేరేదాకా వెనక్కి తిరిగి చూడొద్దు." కానీ కుతూహలం ఆపుకోలేక అతను వెనక్కి తిరిగి భార్య వస్తోందా లేదా అని చూడటంతో ఆమె అదృశ్యమై మృత్యులోకానికి వెళ్లిపోయింది.
జపాన్ లో కథ ఇలా ఉంది. ఇజానాగీ ఇజానామీ ఆదిదంపతులు.సముద్రంలోని ద్వీపములో సంతానంతో ఉంటారు.వారు జపనీయుల గ్రామ దేవతలు.అగ్ని కొడుకును కనగానే ఇజానామీ చనిపోతుంది.భార్య కోసం మృత్యులోకానికి వెళ్లిన ఇజానాగీ దైవాజ్ఞను ధిక్కరించి భార్య తనవెనక వస్తోందా లేదా అనే అనుమానంతో చూడటం ఆమె భూతంగా మారడంతో తన ఇంటి తలుపులు బిడాయిస్తాడు. అలా మృత్యులోకంతో సంబంధం తెగిపోయింది.
బైబిల్ లో కూడా ఇలాంటి కథ ఉంది. లాట్ అతని భార్య సొదోమ్ తామున్న గోమోరా అనే ప్రాంతాన్ని విడిచి వెళ్తారు.దేవదూతలు ముందే హెచ్చరిక చేశారు" ఆప్రాంతం నాశనమౌతుంది. మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లండి " అని.కానీ సోదోమ్ ఉత్సుకత తో చూసి ఉప్పుస్థంభంగా మారింది.
అందుకే ఇలా కథల రూపంలో మనకు తెలిసేదేమంటే భూతకాలంలో బతుకుతూ ఆనాటి విషయాలు తల్చుకుంటే భవిష్యత్తు శూన్యం.అనుమానంతో పని మొదలుపెట్టి మధ్య లో ఆపరాదు. అందుకే పరీక్ష రాసేప్పుడు పిల్లల్ని హెచ్చరించాలి తల తిప్పి వెనుక పక్కల రాసేవారిని చూస్తే కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడేమో అనే అనుమానం వస్తుంది.బాల్యం నుంచే ఇలా అలవాటు చేయాలి.డిబార్ అవకుండా బైట పడాలి. మార్కులు ర్యాంక్ రాకున్నా ఒరిజినాలిటీ ఉంటే తప్పక రాణిస్తారు అనే ప్రేరణ ప్రోత్సాహం కలిగించాలి.
నేడు మన ప్రధాని మోదీజీ ఇలా పిల్లలతో మమేకం కావటం ముదావహం.అబ్దుల్ కలాం నేటికీ విద్యార్థులకు ఆదర్శం.ఇంట బైట పిల్లలకు సపోర్టు ఉంటే వారు బాగా రాణిస్తారు🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి