నోరు లేని జీవాలివి..! : - కోరాడ నరసింహా రావు!
నోరు లేని జీవాలివి..! 
 పాపం - పుణ్యంఎరుగనివి
 కాసిన్ని ఆకులలమలు చూపితే చాలు... 
    నడవమన్న చోటుకి నడిచేస్తుంటాయ్...!
 కసాయి కబేలాకు తీసుకుపోతున్నా... 
 పెంచిన గొల్ల వాని వెంట వెళ్లినట్టే వెలిపో తుంటాయి...!! 

మేత కోసం అడవులనిగాని... 
 తుప్పలు, డొంక లని గానీ కొండలు,గుట్ట లని గాని చూడవు...! 

ఛస్తామా, బ్రతుకుతామా అనికూడాఆలోచించవు..!!

త్రాగటానికిపాలు,తినటానకి మాంసము,

 పెంచుకునే వానికి ఆర్ధిక పరి పుష్టి.... 
ఆఖరికి వాటి బొచ్చుకూడా 
మనకు చలినుండి రక్షణ కల్పించే  

స్వెట్టర్లు,రగ్గులు గా ఉప యోగ పడుతున్నా యి...! 

అంటారు గానీ... బతికితే పులిలాగానో,సింహంలానో
 బతకాలనీ... 
  నే నై తే... "ఏ ఆవు లానో... ఇలా మేక,గొర్రె లానో 
బ్రతక గలిగితే గొప్పే" అని అంటాను! 
    మీ రే మం టారు....! 
    ******
కామెంట్‌లు