వృద్ధులతో ముఖాముఖి:-ఇ.అపర్ణ-తొమ్మిదవ తరగతి -Zpss నర్మెట్ట
   నమస్కారం?
 జ. నమస్కారం.
1) మీ పేరు ఏమిటి?
జ. నా పేరు ఇ. రమవ్వ.
2) మీకు ఎంతమంది పిల్లలు?
జ. నాకు ఇద్దరు పిల్లలు.
3) వారందరూ ఎక్కడ ఉంటారు?
జ. వారందరూ ఈ ఊరిలోనే ఉంటారు.
4) మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి?
జ. నాకు ఇష్టమైన ఆహారం పులిహార.
5) మీకు ఇష్టమైన పూలు ఏమిటి?
జ. నాకు ఇష్టమైన పూలు చామంతి పూలు.
6) మీకు బాగా నచ్చే ఊరు ఏది?
జ. నాకు బాగా నచ్చే ఊరు జనగాం.
7) మీకు బాగా సంతోషాన్ని కలిగించిన సంఘటన ఏమిటి?
జ. నాకు బాగా సంతోషాన్ని కలిగించిన సంఘటన మాకు ఇల్లు వచ్చింది.
8) మీకు చాలా బాధ కలిగించిన సంఘటన ఏమిటి?
జ. మా భర్తకు  పక్షవాతం వచ్చింది.
9) మీకు ఏ పని చేయడమంటే చాలా ఇష్టం?
జ. నాకు బాయికాడ పనిచేయడం అంటే చాలా ఇష్టం.
10) మీరు మాకు ఇచ్చే సందేశం ఏమిటి?
జ. మేము అప్పటి కాలంలో చదువుకోలే.ఇప్పుడు మీరు బాగా చదువుకోవాలి. మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు మీ అమ్మానాన్నలకు పనిలో సహాయం చేయాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు మా కాడికి వచ్చి పోల్లీ బిడ్డ. మీ మమ్మీకి ఇచ్చే సందేశం ఇది.
     

   * ధన్యవాదాలు*

కామెంట్‌లు