చరవాణిమైకాన చెడిపోయెయువతంత..
చాటింగ్ టీటింగు నేర్చి చెరసాలలోమ్రగ్గెను
ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటుపడివారు
తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు అంతా ఊడ్చేసెను.
రాత్రికిరాత్రే వారు రారాజులమవ్వాలని
అడ్డదారిలో పయనిస్తూ దొంగగా మారెను.
హేరాయిన్ కొకైన్ బ్రౌన్ షుగర్ గంజాయి డ్రగ్స్ కు మరిగి దేహాన్ని దేశాన్ని పతనమ్ముజేసెను.
రేపటి దేశ భవితే యువత ఈరీతిగా యుంటే
అగ్గువసగ్గువకు దేశాన్ని అమ్మకమేబెట్టేరు.
నైతికతలేనట్టి కాన్వెంట్ చదువులు
ఆర్థిక దోపిడీ దప్పా
ఆత్మీయతానురాగము నేర్పవూ
స్వార్థచింతనతప్పా
దయాగుణం నేర్పవూ
విలువలలేమితో విదేశీ సంస్కృతి సంప్రదాయాలతో ఊరేగుతుందురు.
ఇకనైనా మేల్కొల్పండి యువతను
ఓమేధావులారా!
బుద్ధిజీవులారా!!
ఓబాధ్యత గల పౌరసమాజమా!
యువతనుకన్నతల్లిదండ్రులారా!
రేపటి మన దేశ దశదిశనుమార్చుటకు
యువతలో జాతీయ భావాలు
దయాజాలి కరుణ
ప్రేమానురాగాలు
నిస్వార్థం
పరోపకారంలాంటి విశిష్ట గుణాల్నీ పాదుగొల్పండి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి