కట్టు బొట్టుకు నిలయమైనదిభారత సంస్కృతి బంగారు సంస్కృతి మనదిపండుగకు పబ్బనికి పట్టం కడుతూనేవిష సంస్కృతి బీజం వేస్తున్నారు.కాలమనె కండ్లకు గంతలు కట్టిచెడ్డిలాంటి మిడ్డీలేసుకొనియువతి తెగ పోజు కొడుతోందితల్లి దండ్రులు ఈ సంస్కృతివొద్దన్న వినకుండా తిడుతోంది.లేనోళ్ల ఇంట్ల అతుకులేసుకున్న లాగులు, ప్యాంట్లుఉన్నోళ్ల ఇండ్లల్లా కనిపిస్తుండేచెడు తిరుగుళ్ళు తిరుగుకుంటూ చేయకూడని పనులెన్నో చేస్తున్నరువినయంగా మాట్లాడుకోకుండావినకూడని మాటలెన్నో మాట్లాడుతున్నరుచెడు చూడొద్దు చెడు వినొద్దుచెడు మాట్లాడొద్దు అనిమాట్లాడిన మహాత్మ మాటకాదంటున్నరు.జనులు తాటి చెట్టుకు పుట్టిన సురాపానకం వదిలి పెట్టిప్రాణాలు తీసే ఆల్కహాల్ తో తయారు చేసిన బీర్ బ్రాండీలు విస్కీలలో మునిగి తెలుతున్నారుప్రాణాన్ని తీసుకుంటున్నారు.దైవములా చూసుకోవాల్సినమాతృ పితృలను ఆనాధ ఆశ్రమాలకు అప్పగిస్తున్నరువిదేశాలు అంటూ వెళ్లితల్లి దండ్రులు కాలం చేసినరాలేక పోతున్నరు.భైరగోని రామచంద్రము:-చరవాణి :9848518597.స్కూల్ అసిస్టెంట్, తెలుగుప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజ్ భవన్, సోమాజిగూడహైదరాబాద్, 500041.
మారిన సంస్కృతి:- భైరగోని రామచంద్రము:-చరవాణి :9848518597.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి