మన దేశం భారతదేశం
ఎంతో మంది వీరులను
మహావీరులను కన్న దేశం
తెల్లోడికి బానిసత్వంగా ఉండలేక
చైతన్యంతో కలిసి కట్టుగా
పోరాడి బానిసవిముక్తులము
ఐన దేశం భారత దేశం
దేశభక్తిని జీర్ణించుకొన్న దేశం
వీరుల వారసులమై బ్రిటిష్
వారిపై తిరగబడిన దేశం
వీరుల శౌర్యత్వానికి
బయపడి పోయింది
బ్రిటిష్ దేశం
భారతదేశ దేశభక్తికే
సలాము కొట్టింది ఆంగ్లదేశం
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం
భారత దేశభక్తిని ప్రపంచ
దేశాలకు చాటిచెప్పింది
ఆర్మీ వీరుల దేశభక్తి
భారత్కె మచ్చుతునక
భరత మాత వీరుల
వీరత్వం, నెత్తురును
ముద్దాడెను
రైతులు పుడమి తల్లిని
నమ్ముకొన్న దేశం
కార్మికులు కష్టాన్ని
నమ్ముకొన్న దేశం
శత్రువుకు సైతం స్నేహం
నేర్పిన దేశం
మువ్వన్నెల జెండాతో
రెప రెప లాడుతున్న దేశం
మన దేశం భారత దేశం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి