మన తొలి గుడి
అమ్మ గర్భ గుడి
నవ మాసాలు మోసి
నవజాత శిశువుకు రూపాన్నిచ్చే....
తానెన్ని బాధలు పడ్డ
నీవు భద్రంగా ఉండు బిడ్డ
అని అమ్మ గర్భంమీద చేయి పెట్టుకొని
మొదటి దీవెనలు ఇచ్చె.....
తొమ్మిది నెలలు నిండినంక
కొట్లాది దేవతలకు మొక్కుతూ ప్రసవించే
ఆది గురువైన అమ్మ బిడ్డను ఒడిలోకి తీసుకోని ముద్దాడే
చందమామను చూపిస్తూ
గోరు ముద్దలు తినిపిస్తూ
మామ కానీ మామ చందమామ అని చెప్పె.....
అత్త అత్త అమ్మ అమ్మ
నాన్న నాన్న తాత తాత
అని ఒనమాలు పలికించె.....
బోర్ల పడుతూ... అంబాడుతుంటె ఆనందపడె
కూర్చొని లేచి నిలబడి పడుతుంటే
లేచి నడుస్తుంటే నవ్వుతుండే
పెరిగి పెద్దవుతుంటే పదిలంగా చుచుకుంటూ ఉండె.....
చదువీడు వచ్చాక బడికి పంపిస్తూ
ప్రయోజకు(రాలు)డు కావాలని ఆశీర్వదీస్తువుండే
పెద్ద పెద్ద చదువులు చదివి
ఉద్యోగమోచ్చాకా మురిసిపోయే....
పెండ్లిడూ వచ్చాక ఒక ఇంటి వారిని చేసి
తెగ ముచ్చటపడే....
పిల్లలకు పిల్లలవుతుంటే
చూసి సంబరపడే
స్వార్థం లేని ప్రేమను పంచుతుండే.....
అమ్మమ్మ నాన్నమ్మ ప్రేమను చూపిస్తూ ఉండె....
వెయ్యి జన్మలెత్తిన వెలకట్టలేనిది
కోటి జన్మలెత్తిన కొనలేనిది
అవనిలో అమ్మ ప్రేమను.......
తిరిగి అమ్మ ఒడి చేరితేనే
తనివి తీరా అమ్మ ప్రేమను పొందేది......
=================================
భైరగోని రామచంద్రము - చరవాణి :9848518597
స్కూల్ అసిస్టెంట్, తెలుగు
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజ్ భవన్, సోమాజిగూడ,
హైదరాబాద్, 500041.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి