పట్టువదలని విక్రమార్కుడు తన ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధీంచి భుజంపైన చెర్చుకుని మౌనంగా స్మశానంనుండి బయలుదేరాడు.
" మహిపాలా అనన్య ప్రతిభావంతుడవు అయిన నీపట్టుదల మెచ్చదగినదే జనీకు అలసట తెలియకుండా సరైన నిర్ణయం అనేకథ చెపుతాను విను...మాళవరాజ్యంలో గుణశేఖరుడు అనే వ్యాపారికి సుగుణిలరాశి అయినఏకైక కుమార్తె ఉన్నది. ఆమెకు తగినవరుని గా అతని దృష్టిలో ముగ్గురుయువకులు ఉన్నారు.వారిలో తగినవరుని ఎంపిక చేసుకోలేక తనమిత్రుడు నగర న్యాయాధికారికి వద్దకువెళ్ళి "మిత్రమా నాఏకైక కుమార్తెవివాహం చేయదలచాను నాదృష్టిలో ముగ్గురు యువకులు ఉన్నారు.కోట్లాది రూపాయల నాఆస్తినీ ,నావ్యాపారాలతోపాటు అల్లారుముద్దుగా పెంచిన నాకుమార్తెను బాగాచూసుకోగలిగిన సమర్ధవంతమైన యువకుని ఎంపిక చేయవలసింది" అన్నాడు. మరుదినం న్యాయాధికారి ముగ్గురు యువకులను పిలిపించి 'నాయనలారా వారం తరువాత మీరు మరలా నాకు కనిపించండి,కానీ ఈవారంలో మీరు ఏదైనా ఒకమంచి పనిచేసి దాన్ని వచ్చేవారం నాకు తెలియజేయండి 'అన్నాడు. మరుసటివారం న్యాయమూర్తి తో గుణశేఖరుడు సమావేశం అయిఉండగా ఆముగ్గురు యువకులు వచ్చారు.'' చెప్పండి నాయనా మీరుగతవారం చెసిన మంచిపని గురించి '' అన్నాడు న్యాయమూర్తి.
మెదటి యువకుడు " నాతండ్రి మరణించినా ఎటువంటి పత్రం లేకున్నా ఆయన చేసినబాకీ ఉందనీ వచ్చిన నాతండ్రి మిత్రుడి మాటనమ్మి అతని బాకీతీర్చాను "అన్నాడు.
రెండో యువకుడు అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వృధ్ధుడిని కాపాడాను అన్నాడు.
మూడవ యువకుడు తమబద్దశత్రువు కుమారుడుని ప్రాణపాయస్ధితిని నుండి కాపాడాను " అన్నాడు.
" విక్రమార్కామహరాజా ఆముగ్గురిలో తగిన వరునిగా న్యాయమూర్తి ఎవరినిఎంపిక చేసాడో చెప్పుతెలిసి చెప్పకపోయావో తలపగిలి మరణిస్తావు"అన్నాడు.
"బేతాళా మొదటి యువకుడు తండ్రిఆస్తి తీసుకున్నప్పుడు తండ్రి అప్పుకూడాతీర్చడం కూడా అతని కుమారుడి ధర్మం. రెండోయువకుడు సాటిమనిషి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మంచిలక్షణం, అది కనీస మానవతా ధర్మం.మనిషి వేదనను సాటిమనిషే అర్ధంచేసుకోవాలి.లేదంటే జంతువులకు మనుషులకు తేడాలేకుండా పోతుంది.సహజమైన మానవతాచర్య అతను చేసిఈపనిలో కనిపిస్తుంది.
మూడయువకుడు శత్రువును కూడాక్షమించడం ఉత్తమలక్షణం. సహనం,ఓర్పు,త్యాగనిరతి,క్షమాగుణం కలిగి అపకారికికూడా ఉపకారంచేసే ధాత్రుత్వంకలిగిన ఆమూడవ యువకుడు గుణశేఖరునికి తగిన అల్లుడు ఇదే సరైన నిర్ణయం " అన్నాడు విక్రమార్కుడు.
విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
సరైన నిర్ణయం . కల్పిత బేతాళకథ . :- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .9884429899
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి