నాన్న :- ఇ. అపర్ణ- 9వ తరగతి-జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాల నర్మెట్ట -జనగామ జిల్లా
ఇంటికి రాజు మా నాన్న
    ఇంటికి ధైర్యం మా నాన్న.

 బాధ్యతలు భరించే నాన్న కుటుంబ భారాన్ని మోసే             నాన్న.

 మోయని బాధను దాచిన కనులు
 బిడ్డను చూసిన పలికిన నవ్వులు.

 నాన్న అంటే నా కిష్టం
 నాన్న చేస్తాడు చాలా కష్టం.

 మనకు ప్రేమ కురిపిస్తాడు
 నాన్న
 అనురాగానికి రూపం అంటేనే నాన్న.

 ఇంటిపట్టున ఉండలేడు నాన్న
 కంటి నిండా నిద్రపోలేదు నాన్న.

 నాన్నను ప్రేమిస్తూ ఉండండి
 నాన్న మనల్ని నవ్విస్తూ ఉంటాడు.

 నాన్న నా ప్రాణం
 నాన్నంటే నా జీవితం.

నా చదువు కోసం కష్టపడే నాన్న
 శ్రమకు రూపమవుతాడు నాన్న 

 నాన్న అంటే నా కిష్టం
 నేను అంటే నాన్నకి ఇష్టం.



కామెంట్‌లు