న్యాయములు -815
"అహృదయ వచసా మహృదయ ముత్తరమ్" న్యాయము.
*****
హృదయం అనగా పర్యాయ పదాలు గుండె, అంతరంగం, ఆత్మ. అహృదయం అంటే హృదయం లేని, ఆత్మ లేని.వచసా అనగా వాక్కుతో,మాటతో అని అర్థము.ఉత్తరమ్ అనగా జాబు, సమాధానము అని అర్థము.
హృదయం అనేది ప్రేమ, ఆప్యాయత, కృతజ్ఞతను వ్యక్తీకరించే చిహ్నము. హృదయం లోతుల్లోంచి మాట్లాడే మాటల్లో కల్మషం ఉండదు. స్వచ్ఛదనం, సహృదయత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలా మిళితమై కనిపిస్తేనే, మాటల్లో వినిపిస్తేనే అది హృదయం అనిపించుకుంటుంది.
హృదయ పూర్వకములు గాని మాటలకు హృదయపూర్వకము గాని సమాధానమే యీయబడును". అని ఈ న్యాయమునకు అర్థము.
అందుకే మన పెద్దలు "మాటకు మాట తెగులు-నీటికి నాచు తెగులు" అనే సామెతను తరచూ ఉదాహరణగా ఉపయోగిస్తుంటారు. అంతే కదా! మాట్లాడే మాటను బట్టే ప్రతిస్పందన ఉంటుంది. మృదువుగా మాట్లాడితే మృదువైన సమాధానం వస్తుంది.కర్కశంగా మాట్లాడితే కఠినంగానే సమాధానం వస్తుంది.
ఇంకా కొంత మంది మాటలు నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించినట్లు ఉంటాయి. అంటే వారి మాటలు నాలుక మీదనుండి మాత్రమే వచ్చినట్లు ఉంటాయి కానీ నాభి నుండి అనగా హృదయం నుండి వచ్చినట్లు ఉండవు.
మరి అలా మనసు లేకుండా మాట్లాడేవారికి తిరుగు జవాబు కూడా అలా మనసు లేని విధంగానే ఉంటుంది.
అందుకే ఇలాంటి వారిని ఉద్దేశించి ప్రముఖ రచయిత్రి పాకాల యశోదా రెడ్డి గారు "కొత్త బాట" అనే కథలో "కడ్పుల ఇసం- నాల్కెన తీపి అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. లోలోపల కుట్రలు కుతంత్రాలు పెట్టికొని మాటల్లో తీయదనం కురిపాస్తుంటారు. ఇలాంటి వారితో చాలా ప్రమాదకరం. అలాంటి వారి మాటలను మనుషుల మనస్తత్వాన్ని గమనిస్తూ ఉండాలి. మళ్లీ జోలికి రాకుండా కొంచెం కఠినంగానే ఉండాలి.
హృదయం లేకుండా మాట్లాడేవారికి తిరుగు సమాధానం హృదయం లేకుండానే ఉండాలి. అప్పుడే తమ లోని లోపాలేమిటో తెలిసి వస్తాయి.
"అహృదయ వచసా మహృదయ ముత్తరమ్" న్యాయము ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే హృదయం లేకుండా మాట్లాడ కూడదు.మంచిగా మాట్లాడాలి.అందులో మానవత్వం వెల్లివిరియాలి..అప్పుడే మాటతో పాటు మనిషి విలువ పెరుగుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి