న్యాయాలు-807
"అత్యుచ్ఛ్రాయః పతన హేతుః" న్యాయము
*****
అత్యుచ్ఛ్రాయః అనగా అతిశయోక్తి,మిక్కిలి ఉన్నతత్వము. పతనం అనగా ఏదైనా విషయం దిగువకు రావడం, పడిపోవడం,క్షీణించడం. హేతువు అనగా కారణం, ఉద్దేశం, సాధనం అనే అర్థాలు ఉన్నాయి.
మిక్కిలి ఉన్నతత్వము నొందుట పతన కారణమే అని అర్థము.అనగా"పెరుగుట విరుగుట కొరకే" అనే అర్థంతో కూడిన ఈ న్యాయమును మన పెద్దవాళ్ళు తరచూ ఉదాహరణగా చెబుతుంటారు.
"పెరుగుట విరుగుట కొరకే" అనగా ఏదైనా బాగా పెరిగినప్పుడు విరిగిపోవడానికి,లేదా క్షీణించడానికి సిద్ధంగా వుంటుంది.తప్పకుండా క్షీణిస్తుంది" అని అర్థము ప్రతి దానికీ ప్రారంభం, మధ్యమం , ముగింపు ఉంటాయి.
ఈ న్యాయాన్ని అనేక కోణాల్లో చూడవచ్చు. అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు.మనిషి జీవిత దశలనే మొట్టమొదటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదెలా అంటే పుట్టుక నుంచి మరణం వరకు. చిన్న ప్రాణిగా ఈ లోకంలో లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ వుంటాడు మనిషి. అలా ఎంతో ఎత్తుకు ఎదిగిన జీవి వృద్ధాప్యం బారిన పడి మరణిస్తాడు.అలా ఎంత పెరిగినా విరుగుట అనేది తప్పదు అంటే పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు.
ప్రకృతి ధర్మం కూడా అదే. ఆయా ఋతువుల్లో దొరికే పూలు, కాయలు, పండ్లు ఆయా ఋతువుల్లోనే విస్త్రుతంగా పండుతాయి.ఆ తర్వాత వాటంతట అవే క్షీణించి పోతాయి.ఇక ఒకేసారి ఉప్పెనలా బాధలతో నిండిన దుఃఖము కానీ, సంతోషం కానీ కలుగుతుంటాయి.అంతే వేగంగా పెరిగి తరిగి పౌతుంటాయి. చెట్టు , పిట్ట కూడా అంతే....
ఇలాంటి భావమే వచ్చేలా రాసిన సుమతీ శతక పద్యాన్ని చూద్దామా...
"సరసము విరసము కొరకే/పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే/ పెరుగుట విరుగుట కొరకే/ ధర తగ్గుట హెచ్చుట కొఱకే తథ్యము సుమతీ!"
అనగా మనసుకు ఆనందాన్ని కలిగించేలా మాట్లాడటం, చేష్టలు చేయడము... ఇవన్నీ దుఃఖము కలగడానికే కారణ భూతాలు.పరిపూర్ణ సుఖం కలగడం అంటే ఎక్కువ కష్టాలు అనుభవించడానికే. వృద్ధి చెందడం అంటే క్షీణించడం కోసమే.ఒక వస్తువు ధర తక్కువ కావడం అంటే పెరగడం కోసమే.
కాబట్టి కష్టాలకు కృంగి పోవడం, సుఖాలకు పొంగిపోవడం కూడదు. ఏ కప్టమూ శాశ్వతంగా ఉండదు.జీవితంలో ఇవి ఒకదావెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి.
ఇక వీటన్నింటినీ మించి మరో చక్కటి ఉదాహరణగా చంద్రుడు. శుక్ల పక్ష చంద్రునిలా పెరుగుతూ ఉంటాడు. అనంతరం క్రమంగా క్షిణించి పోతాడు అమావాస్య వస్తుంది.తిరిగి క్రమంగా పుంజుకుంటాడు పౌర్ణమి వస్తుంది.ఇలా క్షీణించడం తర్వాత మళ్లీ పూర్వ స్థితికి రావడం జరుగుతుంది.
కొంతమందికి మహా గర్వంగా ఉంటుంది.అది కూడా అంతే...ఇలా నిత్యజీవితంలో అనేకం జరుగుతుంటాయి.
"అత్యుచ్ఛ్రాయః పతన హేతువుః న్యాయము" లోని అంతరార్థము ఇదే.ఎంతగా పెరిగినా తరగిపోవడం తప్పదు"అని.
ఇది తెలుసుకుని మసలుకుందాం. దేనికీ తొందర పడకుండా స్థితిప్రజ్ఞతో జీవితాన్ని గడుపుదాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి