పాఠశాల హేబిటేషన్ పరిధిలో గల డ్రాపౌట్స్ ని గుర్తించి, తక్షణమే బడికి రప్పించేందుకు తగు కృషి చేయాలని నివగాం క్లస్టర్ పాఠశాల సముదాయం ఛైర్ పర్సన్ ఎస్.నిర్మల అన్నారు. బుధవారం రెండో పూట నివగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన క్లస్టర్ స్థాయి శిక్షణా తరగతులకు ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సమావేశంలో నిర్మల మాట్లాడుతూ డ్రాపౌట్స్ నిర్మూలనతో పాటు సకాలంలో సిలబస్ పూర్తి గావించుట, విద్యా సామర్ధ్యాలలో వెనుకబడిన విద్యార్థుల మెరుగుదల కోసం కృషి, అభ్యసనా ఫలితాలు గూర్చి తదితర అంశాలపై మాట్లాడారు.
మాతల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొంతల వెంకటరమణ, కుంటిభద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని ధర్మాన కృష్ణవేణి, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ పల్ల రాధిక తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఈనాటి శిక్షణా తరగతులకు నివగాం క్లస్టర్ పరిధిలోని పాఠశాలల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, అన్ని సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్ లు హాజరయ్యారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి