తాతోపదేశం :- ఐనకోట. రవి కుమార్ :నెల్లూరు.
 రేయ్ మనవడా..
తొలి పొద్దు సూరీడా!!
నా పడవ వెళ్లి పోతుంది రా..
నా కుండ చిల్లు పడెనురా...
నా మాటే, చద్ది మూటరా...
రామాయణం, మన 
కుటుంబ ప్రామాణికం.. రా!
భారతం, మన ఉమ్మడి 
చుట్టం రా...
రేయ్ మనవడా!
తొలి పొద్దు సూరీడా!!
పండగలన్నీ..
ముంగిట గొబ్బెమ్మలు రా..
కడగండ్లు..
కావడి కుండలు.. రా!
రేయ్,
మనవడా!
వినరా..
మనసారా...!
సెల్లు ఆట కీ టాటా చెప్పరా..
హెల్లు ముల్లు గుచ్చు కొనురా..
ఆవకాయ బద్ద,
పెరుగు ముద్ద, బలం రా...
జోమోటా..
గిమోటా...
ఫ్రీ ఫైర్..
ఓ టి టి..డిలీట్ చేయరా...
చెడుగుడు..
కోతి కొమ్మచ్చి..
ఈదడం..
వచ్చే పులి వచ్చే..
ఈ ఆటలే ముద్దు రా!
పెద్దమ్మా..
అత్తమ్మా..
నానమ్మ..
అమ్మమ్మా..
ఈ పిలుపు లో..
తేనే.. ఊరురా....
అమ్మ ఒడిలో..
కథామృతం..
ఉగ్గు పాలతో, తాగరా...
ఆవు పాలు..
బంధువుల మురిపాలు 
కడుపారా సేవించరా!
రేయ్..
మనవడా!
సైనికుడా!
నా మాట,
చద్ది మూటరా!!
కక్షలు..
కార్పణ్యాలు..
తుంగలో తొక్కేయారా!!
ఈర్షలు..
అసూయాల కలుపు మొక్కలు 
పీకేయారా!!
అందరు బాగుండాలి!
అందులో..
మనం ఉండాలి!
రేయ్..
మనవ డా..!
పున్నమి చంద్రుడా!!
నిదానం..
ప్రధానం రా!
నడత లో..
సత్య మార్గం నడవ రా!!!
అచిరకాలం..
ఆదర్శం గా..
బావి తరాలకి..
ఉండాలి రా!
ఇదే.. నా గీతోపదేశం!
ఇదే.. నా తాతోపదేశం!!
సర్వేజనా.. సుఖినోభవంతు!!!

కామెంట్‌లు