దైవ స్వరూపులు తల్లిదండ్రులు:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
కన్నవారి కళ్ళల్లో
ఆనందం చూడాలి
వారి చిరు ఆశల్లో
జీవాన్నే నింపాలి

తల్లిదండ్రులను మహిలో
దీవెనగా తలవాలి
వారిని సదా మదిలో
గూడు కట్టుకోవాలి

తల్లిదండ్రుల త్యాగము
కడవరకు గుర్తుండాలి
వారు చూపు ప్రేమలను
అర్థం చేసుకోవాలి

భగవంతుని స్వరూపము
జీవితాల్లో దీపము
అమ్మానాన్నలు కదా!
గుర్తించుకొమ్ము సదా!


కామెంట్‌లు