న్యాయములు-792
"అశ్రేష్ఠః శ్రేష్ఠానుసారీ" న్యాయము
******
శ్రేష్ఠులు అనగా ఉత్తములు.అశ్రేష్ఠః అనగా ఉత్తములు కాని వారు.అనుసారీ అనగా అనుసరించు వాడు.
శ్రేష్ఠుడు కాని వాడు శ్రేష్ఠుడైన వాని నడవడిని అనుసరిస్తాడు అని అర్థము. దీనినే శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు.
"యద్య దాచరతి శ్రేష్ఠస్తత్త దేవేతరో జనః!/స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే!!".
అనగా "ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు,అనుత్తములు కూడా దానినే ఆచరిస్తారు.ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే సమస్త లోకం అనుసరిస్తుంది" అని అర్థము.
ఉత్తములు మార్గం చూపే వారు.అన్యులు, అనుత్తములు... ఉత్తములు చూపే మార్గంలో నడిచే వారు.ఉత్తములు దేనికి ప్రాధాన్యతనిస్తారో సమస్త లోకం దానికే ప్రాధాన్యతనిస్తుంది. ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో లోకమంతా దానినే ప్రమాణంగా స్వీకరిస్తుంది.
దీనికంతటికీ కారణం ఏమిటంటే మానవుడు ప్రధానంగా అనుకరణ శీలి. అది పుట్టుకతోనే వచ్చే సహజసిద్ధమైన స్వభావం.
పొత్తిళ్ళలో పసికూన అమ్మను, ఇంటిలోని వాళ్ళను చూస్తూ వారిని,వారి మాటలను నడవడికను అనుకరిస్తుంది. అలా పిల్లలు పెద్దలను అనుకరిస్తూ అనుసరిస్తూ వుంటారు. విద్యార్థులు/ శిష్యులు ఉపాధ్యాయులు/ గురువులను అనుసరిస్తుంటారు. వ్యక్తులు ఎప్పుడైతే తమ సత్ప్రవర్తన,సచ్ఛీలం, ధర్మం బద్ధమైన జీవితాన్ని గడుపుతూ వుంటారో వారిని చూసి ప్రభావితులై ప్రేరణ పొంది వారిని అనుసరిస్తూ ముందుకు సాగిపోతుంటారు.
అందుకే జానపదులు తమదైన శైలిలో" "పెద్ద నాగలి ఎలా పోతే చిన్న నాగళ్ళు అలా పోతాయి" అనే వారు. పెద్ద నాగలి అంటే ఇక్కడ బాగా అనుభవం ఉన్న ఎద్దులను కట్టిన నాగలి. దానిని పదే పదే ముల్లుగర్రతో పొడవాల్సిన,ఛర్నాకోలా ఝుళిపించాల్సిన అవసరం లేదు. పొలం మడిలోకి దున్నడానికి దిగిందంటే చాలు.చక్కగా సాలు తప్పకుండా తిరుగుతుంది.దాని వెనుక నడిచే నాగళ్ళు దానిని చూసి అనుసరిస్తూ నేర్చుకుంటాయి అన్నమాట.
ఇలా శ్రేష్ఠులను అనుసరించడం అనేది "ధర్మో రక్షతి రక్షితః" లాంటిది.అనగా మన పెద్దలు ధర్మమును పాటించేవారు ధార్మికులు అయితే వారిని తర్వాతి తరం వారు అనుసరించి ధర్మాన్ని పాటిస్తారు.ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది."ధర్మే సర్వం ప్రతిష్ఠితం"అనగా ధర్మంలోనే అన్నీ యిమిడి ఉన్నాయి అని అర్థము.
అలా ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపి ఉత్తములుగా సమస్త మానవాళికి ఆదర్శంగా నిలిచిన వారు పురాణేతిహాసాలలో చాలామందే ఉన్నారు. రామాయణంలో శ్రీరాముడిని అన్ని కోణాల్లోనూ ఎంతో శ్రేష్ఠుడుగా, ధర్మ రక్షకుడిగా చెప్పుకుంటాం.
మన పెద్దలు ఈ "అశ్రేష్ఠః శ్రేష్ఠానుసారీ" న్యాయము ను ఉదాహరణగా చెప్పడానికి కారణం రేపటి పౌరులు అయిన మన పిల్లలకు చిన్నప్పటి నుండే ఉత్తములైన వారి జీవిత చరిత్రలను, కథలను చెబితే వారిని ఆదర్శంగా తీసుకుని ఉత్తములుగా మారాలనే ఉద్ధేశ్యంతో చెప్పడం జరిగింది.
కావున మనం మరియు మన పిల్లలు అశ్రేష్ఠ శ్రేష్ఠానుసారీ న్యాయమును అనుసరిద్దాం. ధర్మవర్తనులతో సమాజం నిండేలా చూద్దాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి