నీకోసం మల్లెపూలు తెచ్చా
నాకు మల్లెలు అంటే ఎంతో ఇష్టం ఈ మల్లెల కంపు ఎంత ఇంపుగా ఉంటుందో!
ఒసేయ్ కొంప ముంచే
సావ్.
కమ్మటి వాసన వచ్చే మల్లెలు తెచ్చిస్తే కంపు
అంటావా!
అయ్యో నేనుఅనడంకాదు.
కంపు. అంటే మంచివాసన అని అర్థంకూడా ఉందని లింగ్విస్టిక్ పరీక్షకు కూర్చున్న తర్వాతనే నాకు తెలిసింది. నన్నయ కూడా ప్రయోగించాడు "తను కంపు. .."అంటే ఒళ్లు వాసన. అంటూ సత్యవతిని,అదే మత్స్యగంధిని గూర్చి గాబోలు అన్నాడు.
అందుకే ప్రయోగించా.
ఇలా అర్థాలు తారు మారు చేస్తే అపార్థాలు వస్తాయే తల్లి.
అయ్యో! బంగారం నేను చేయలేదు భాషా చరిత్రలో ఒక పార్ట్ అర్ధపరిణామం.
అంటే,ఒక తరంలో ఉన్న అర్థం కొన్నాళ్లకువేరే అర్థం గా మారిపోతుంది ఇటువంటి పదాలు చాలా ఉన్నాయి.
నీకు కొన్ని రుజువు చూపిస్తా చూడు
చీర అంటే ఇప్పుటి అర్థం ఏమిటి? ఆడవాళ్లు కట్టుకుని వస్త్రం చీర అంటారు.
కానీ రాముడు నార చీరలు ధరించి అడవికి వెళ్ళాడు అని చెప్పబడింది.
ఏమిటి రాముడు చీరలు కట్టుకున్నాడా! ఆనీ ఆశ్చర్య పోకూడదు.
ఆ నాటి అర్థం చీరకు వస్త్రం అని అర్థం. రాను రాను అది చీర అని ఆడవాళ్లు కట్టుకోనే దానికి పరిమితమైంది.
నార చీరలు అంటే నార వస్త్రాలు అని అర్థం.
ముష్టి అంటే పిడికిలి.
వాకిట్లోకి వచ్చి
కొంచెం బియ్యం పెట్టమని అడిగిన ముష్టి వాళ్లకు మన ముష్టితో వాళ్లకు బియ్యం వేస్తాం ఇప్పుడు చెప్పండి ఎవరు ముష్టి వాళ్ళు ముష్టి కలిగిన వాళ్ళం మనం.
సభికులు అంటే ఒకప్పటి అర్థం సభలో ఉన్నవాళ్లు సభా సదులు,కానీ తర్వాత ఆ మాట జూదగాళ్లు అని అర్థంలోకీ మారిపోయింది.
అవ్వ. అంటే స్త్రీ అని అర్థం.
ప్రస్తుతం వయసు మళ్ళిన వాళ్ళను ఆవ్వ అంటాం
తెలంగాణ వైపు ఇప్పటికీ అవ్వ అనే పదం ఆడవాళ్లకందరికి వాడుతున్నారు.
ఎందుకంటే మా చెల్లెలు ఇంటికి వెళ్లాను. మా చెల్లెలు "పనవ్వ వచ్చింది" అన్నది నేను ఎంత పెద్ద అవిడో అనుకున్నా చూస్తే పదహారేళ్ల పిల్ల అప్పుడు అనుకున్నాను ఇక్కడ ఇంకా స్త్రీకి అవ్వ అని వాడుతున్నారు అని
ఆంధ్రాలో ముసలి వాళ్లకు మాత్రమే అవ్వ అన్న పదం వాడుతున్నాము.
M.A లో ఒక లింగ్విస్టిక్ పేపర్ ఉంది. అది చదివిన తర్వాత చాలా నచ్చింది నాకు. ,
ఒక పరీక్ష పార్ట్ వన్ కట్టి పాస్ అయ్యాను.
భద్రిరాజు కృష్ణమూర్తి గారు మంచి పుస్తకం రాశారు.
ఈ సబ్జెక్టులో ప్రపంచ భాషలు, ఒకటితో ఒకటి పోలిక, ఏది తల్లి భాష ఏది పిల్ల భాష
మొదలైన విషయాలు భాషా చరిత్ర చెప్తుంది.
తల్లి సంస్కృతం అన్ని భాషలకు" అన్న మాటను పరిశోధించి
"తెలుగు భాషకు మూల భాష ద్రవిడ భాష, సంస్కృతం కాదు" అని భాషా చరిత్రకారుడు నిర్ణయించారు.
భాషలు ఎలా పుడతాయి? అన్నది ప్రశ్న.
ఇక భాషనుండి మరి కొన్ని భాషలు పుడతాయని తెలుస్తున్నాది. ఎలా? అంటే
ఉదాహరణకు ప్రస్తుతం తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాలు ఉన్నాయి.ఈ మూడి ట్లో పరిశీలిస్తే వాళ్లు మాట్లాడేది తెలుగే అయినప్పటికీ, ఎంతో వ్యత్యాసం కనబడుతున్నాది,
యాసలో గాని, వస్తువులకున్న పేర్లు గాని వేరువేరుగా ఉంటాయి
అయితే మొత్తం మీద మూడిటినీ కలిపి ఆంధ్రప్రదేశ్ లోనీ తెలుగు భాష అని అంటున్నాం
కానీ కొన్ని వందల సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ మూడు భాషల మధ్య పూర్తిగా అర్థం, ఉచ్చారణ, యాస అన్ని వేరైపోతాయి అప్పుడు వాటిని, వేరు వేరు భాషలుగా పేర్లు పెట్టి పిలవడం జరుగుతుంది అలానే ద్రావిడ భాష నుండి తెలుగు, కన్నడ, మలయాళ భాషలు విడిపోయాయని మనం గ్రహించాలి.
అందుకే చాలా మటుకు భాషల్లో పోలికలు ఉంటాయి.
తమిళంలో అప్పో అంటే మనం అప్పుడు. అంటాం.
కయి చెయి (hand)
ఒక భాష మాట్లాడే వ్యక్తి మరొక కొత్త భాష నేర్చుకోవాలంటే యాసతో సహా నేర్చుకునేటట్లు బాషా చరిత్ర కారులు లిపి తయారు చేశారు .
ఉదాహరణకు మనం చాట చిర్రాకు అంటాం. ఈ పలికేటప్పుడు మన సౌండ్ లో యకారం కూడా . ఉంటుంది. నేర్చుకున్న
వాళ్ళు ఆ య కారంతో కూడా నేర్చుకునేటట్లు ఒక అక్షరాన్ని గుర్తుగా పెట్టారు. కొత్తవాళ్ళు తెలుగు నేర్చుకున్నప్పుడు ఆ అక్షరంతో మనలాగే పలకగలరు.
ఇవన్నీ బాషా చరిత్రలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అందుకే అందరికీ తెలిసినవవే ఇక్కడ. అయినప్పటికీ నాకు తెలిసినవి, ఎవరైనా తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని రాయడం జరిగింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి