సుప్రభాత కవిత : - బృంద
చీకటి దుప్పటి తొలగించి 
రేపటి ఆశలు పరికించి 
మాపటి  దిగులు సవరించి 
లోకపు పయనం  గమనించి..

వేదనలన్నీ మరిపించి 
వేడుకలిచ్చి మురిపించి 
వేయి వరాలను కురిపించి 
వెలుగుల  దారిని నడిపించి...

ఎత్తున చేర్చి నిలిపి 
మత్తులో పడవేయక 
కొత్తగ వచ్చిన మార్పులకు 
నెత్తిన కొమ్ములు రానీకా....

అనుభవాలే పాఠాలుగా 
అవయవాలే సైన్యంగా 
అలసట లేక సలిపే 
ఆలోచనలే ఆయుధాలుగా...

పెదవుల నవ్వులు చెదరనీక 
హృదయం దేనికీ బెదరనీక 
అడుగులు ఎక్కడా తడబడక 
పయనం  మొత్తం తోడుంటానని...

వచ్చే వరాల వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు