సమాచారంతో వచ్చిన విత్తనం
కొత్తగానే అనిపిస్తుంది.
అది మొగ్గ తొడిగి పువ్వై పూసి
కాయై పలమై మొక్కై మొలిచీ
పరిచయమవుతుంది.
సమాచారంతో వచ్చిన నీరు
భూమికి ఏం సమాధానం ఇస్తుంది.?
ఆవిరై మేఘమై చుక్కై నీరై చివరికి నదై
మహాసముద్రమై తెలిసిపోతుంది.
ఎలాంటి సమాచారం లేకుండా వచ్చిన మనిషి
వ్యక్తిగత సమాచారంతో ఒక ప్రపంచాన్ని సృష్టించీ
తనను తాను రక్త మాంసాల జ్ఞాపకంగా మార్చుకున్నాడు.!!
ఇంత సమాచారాన్ని తెచ్చిన మట్టి
మళ్లీ పుట్టదు!!
పుడితే ఆ సమాచారం మారుతుంది!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి